ఆగిపోయిన RRR ట్రయిల్ షూట్‌..!

343

బాహుబ‌లి త‌ర్వాత ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ వంటి ఇద్ద‌రు స్టార్ హీరోలు ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. లాక్‌డౌన్ వ‌ల‌న చిత్ర షూటింగ్‌కి కొద్దిరోజులుగా బ్రేక్ ప‌డ‌గా, ప్ర‌భుత్వం సడ‌లింపుల‌తో చిత్ర ట్ర‌యిల్ షూట్ ప్రారంభించాల‌ని మేక‌ర్స్ భావించారు.

హైద‌రాబాద్‌లో క‌రోనా విజృంభిస్తుంద‌నే కార‌ణ‌మో లేదంటే ఇత‌ర కార‌ణాలో తెలియ‌దు కాని ఆర్ఆర్ఆర్ ట్రయిల్ షూట్ ఆగిపోయింద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. టాలీవుడ్ సినిమా షూటింగ్‌ల‌కి అనుమతులు వచ్చినా, ఎవరూ షూటింగ్స్ నిర్వహించడం లేదు. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ త‌గ్గాకే షూటింగ్స్ ప్రారంభించ‌డం బెట‌ర్ అని మేక‌ర్స్ భావిస్తున్నారట‌. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జ‌న‌వ‌రి 8,2021న విడుద‌ల చేస్తార‌ని గ‌తంలో ప్ర‌క‌టించినప్ప‌టికీ, ఈ ప‌రిస్థితుల‌లో అనుకున్న స‌మ‌యానికి చిత్రం విడుద‌ల క‌ష్ట‌మే అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here