ఈ జోక‌ర్ల వ‌ల్లే ఏపీని లైట్ తీసుకుంటున్నారేమో: వ‌ర్మ‌

సినిమాల‌పై, రాజ‌కీయాల‌పై త‌నదైన శైలిలో వివాద‌స్ప‌దంగా స్పందించే రామ్‌గోపాల్ వ‌ర్మ తాజాగా ట్విట‌ర్ ద్వారా మ‌రో బాంబ్ పేల్చాడు. ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో ఏపీకి జ‌రిగిన అన్యాయం గురించి పార్ల‌మెంట్ వెలుప‌ల ఆందోళ‌న చేస్తున్న టీడీపీ ఎంపీల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. వాళ్ల‌ను జోక‌ర్ల‌తో పోల్చాడు. వారి వ‌ల్ల టీడీపీ ప‌రువు పోతోంద‌ని ఆవేద‌న వ్యక్తం చేశాడు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌తినిధులుగా ఎన్నికైన ఇలాంటి జోక‌ర్ల‌ను చూసి న‌రేంద్ర‌మోదీ ఏపీని కూడా జోక్‌గా తీసుకుంటున్నాడేమో. వీరంతా జోక‌ర్ల‌కు త‌క్కువ‌.. అంటూ ట్వీట్ చేశాడు. అనంత‌రం అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు క‌లిగిన తెలుగుదేశం పార్టీ ప‌రువును వీరు జాతీయ స్థాయిలో దిగ‌జారుస్తున్నార‌ని మ‌రో ట్వీట్ చేశాడు. వ‌ర్మ చేసిన ఈ ట్వీట్ ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *