రివ్యూ : యాక్షన్ థ్రిల్లర్ ‘ధృవ’

261

రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ – హిప్ హాప్ త‌మిళ…

ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్,

ఆర్ట్ – నాగేంద్ర,

ఎడిటర్ – నవీన్ నూలి,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వి.వై. ప్రవీణ్ కుమార్,

ప్రొడ్యూసర్స్ – అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌,

దర్శకుడు – సురేందర్ రెడ్డి.

రేటింగ్: 3/5

వరుస ఫ్లాపులతో వున్న రామ్ చరణ్… ‘ధృవ’ మూవీతో మన ముందుకొచ్చాడు. గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్ లీ మూవీలు వరుసగా నిరాశపరిచాయి. అంతేకాదు.. జంజీర్ రీమేక్ తుఫాన్ లో వేసిన పోలీసు క్యారెక్టర్ కూడా చరణ్ కు అచ్చిరాలేదు. అయినా సరే.. ఈసారి మళ్లీ పోలీసు క్యారెక్టర్ తో తమిళంలో హిట్టయిన ‘తని ఒరువన్’ రీమేక్.. ‘ధృవ’తో ఈ రోజు ముందుకొచ్చాడు. మరి ఈసారి అయినా… పోలీసు పాత్రతో ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకున్నాడో చూద్దామా?

స్టోరీ: అనాధగా పెరిగి ఐపీఎస్ ఆఫీసర్ అయిన ధృవ కు దేశభక్తి ఎక్కువ. అవినీతిని కానీ.. దేశానికి నష్టం కలిగించే పనులను గానీ… సంఘ విద్రోహ శక్తులను గానీ అసలు సహించడు. ట్రైనింగ్ లో వుంటూనే ఇలాంటివారిపై తన మిత్రులు నవదీప్, రణధీర్ మరో ఇద్దరితో కలిసి ఓ కన్నేసి.. వారు చేసే చర్యలను భగ్నం చేస్తూ వుంటాడు. ఆ క్రమంలో సిద్ధార్థ్ అభిన్యు(అరవింద్ స్వామి) అనే సైంటిస్ట్ జనరిక్ మెడిసిన్ ను అడ్డుకొని.. తను కనిపెట్టిన ఖరీదైన మెడిసిన్ ను ఇండియాలో అమ్మాలని చూస్తుంటాడు. దానికి రాజకీయనాయకులు.. రౌడీలు సహాయం చేస్తుండటాన్ని చూసి ధృవ చలించిపోయి… వారి చర్యలను అడ్డుకోవడానికి తగిన ప్లాన్ చేస్తూ వుంటాడు. సిద్ధార్థ్ అభిమన్యు సింగ్ చేసే చర్యలన్నింటినీ అష్టదిగ్భంధనంతో ఎలా ఆపగలిగాడనేదే మిగతా కథ.
స్టోరీ విశ్లేషణ: తమిళంలో విడుదలైన ‘తని ఒరువన్’ మూవీ ఎంత బిగ్గెస్ట్ హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను చరణ్ తో రీమేక్ అనగానే టాలీవుడ్ క్రిటిక్స్ చాలా మంది పెదవి విరిచారు. కానీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాత్రం చరణ్ తోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. అందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి తోడు కావడంతో.. ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకొంది. ఈ చిత్రానికి మెయిన్ కథ.. కథనం. తమిళం మాతృక ఒరిజినాలిటీని ఏమాత్రం మిస్ అవ్వకుండా రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా ఇంటెలిజెంట్ గా వుంది. దాంతో ఈ చిత్రం మాస్.. క్లాసు అనే బేధం లేకుండా నచ్చుతుంది.
రామ్ చరణ్.. ధృవ పాత్రకు కరెక్ట్ గా యాప్ట్ అయ్యాడు. అతని ఫిజిక్ బాగా ప్లస్ అయింది. ఇంటెలిజెన్స్ తో హీరో… విలన్ల మధ్య సాగే సన్నివేశాలు ఆద్యంతం ఉత్కంఠ భరితాన్ని కలిగిస్తాయి. తని ఒరువన్ లో అరవింద స్వామి నటనకు ఎందుకు అంత పేరు వచ్చిందో ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఇక చెర్రీ ఫ్రెండ్ పాత్రలో నటించిన నవదీప్ కూడా గౌతమ్ పాత్రలో చక్కగా నటించాడు. ఓ రకంగా గౌతమ్ పాత్ర ఎండ్ అయ్యే సీన్ నుంచి ధృవ గ్రాఫ్ బాగా పెరుగుతుంది. హీరో-విలన్ల మధ్య సాగే ఇంటెలిజెన్స్ సీన్స్ తో ప్రేక్షకులు థ్రిల్ గురవుతారు.
రామ్ చరణ్ చాలా కాలం తరువాత ఓ మంచి క్యారెక్టర్ తో పరెఫెక్ట్ అనిపించుకున్నాడు. తాను ఎంతో కష్టపడిచేసిన సిక్స్ ప్యాక్ కష్టం.. వృథా కాలేదనే చెప్పాలి. సీరియస్ కాప్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. అలానే అవింద్ స్వామి కూడా. తెలుగులో కం బ్యాక్ ఫిలిం ఇది అవ్వడం అరవింద్ స్వామికి కలిసొచ్చే అంశం. గౌతమ్ పాత్రలో నవదీప్ చక్కగా నటించాడు. అరవింద్ స్వామి తండ్రిగా పోసాని కృష్ణమురళి పాత్ర బాగుంది. అలానే ఫోరెన్సిక్ నిపుణురాలిగా రకుల్ పాత్ర బాగుంది. ఓ వైపు టామ్ బాయ్ గా కనిపిస్తూనే… చెర్రీ ప్రియురాలిగా ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలు చేసిన నాజర్, రణధీర్ తదితరులు పర్వాలేదు అనిపించారు.
ఈ సినిమాకు సురేందర్ రెడ్డి రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా బాగుంది. స్టైలిష్ డైరెక్టర్ అనే పేరును మరోసారి సురేందర్ రెడ్డి నిరూపించాడు. ప్రతి ఫ్రేమ్ లోనూ ఎంతో జాగ్రత్త తీసుకుని తెరకెక్కించాడు. కిక్2 ప్రభావం ఏమాత్రం కనిపించకుండా ఈ చిత్రాన్ని కేవలం చెర్రీని దృష్టిలో పెట్టుకునే తెరకెక్కించాడు. హిప్ హాప్ మ్యూజిక్ పెద్దగా లేకున్నా.. నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కాశ్మీర్ అందాలను చక్కగా ఒడిసి పట్టాడు కెమెరామెన్. ఎడిటింగ్ కూడా బాగుంది. రెండున్నర గంటల నిడివి వున్నా ఎక్కడా బోరింగ్ వుండదు. ఈ చిత్రానికి అల్లు అరవింద్.. ఎన్వీ ప్రసాద్ లిద్దరూ నిర్మాతలు. కాబట్టి.. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here