‘ప్రాణం ఖరీదు’ మెప్పిస్తుంది

44

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు సినిమా గుర్తుందిగా… మళ్లీ ఇన్నాళ్లకు అదే టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో సినిమా వచ్చేసింది. ప్రశాంత్, అవంతిక, తారకరత్న కీలక పాత్రలు పోషించారు. పి.ఎల్.కె.రెడ్డి దర్శకత్వం వహించారు. నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మాత. సంగీతం వందేమాతరం శ్రీనివాస్. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకుల్ని మెప్పించిందో లేదో చూద్దాం.

కథేంటంటే :

ఓ డాక్టర్, ఓ బ్రోకర్ ఓ క్యాబ్ ఎక్కుతారు. ఈ క్యాబ్ డ్రైవర్ ఫస్ట్ మంచిగానే ఉంటాడు. కానీ సడ న్ గా డ్రైవర్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఒక గేమ్ అడుదాం అని భయపెడతాడు. ఇద్దర్ని లాక్ చేస్తాడు. వాళ్ళు భయపడట్లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేని కార్ లో నుంచే గన్ తో షూట్ చేసి చంపుతాడు. ఈ మర్డర్ మిస్టరీ ని ఛేదించేందుకు స్పెషల్ ఆఫీసర్ గా అలెగ్జాండర్ (తారకరత్న) ని నియమిస్తారు. అతనికి సహాయకుడిగా షఫీ ఉంటాడు. తనకు రెస్పెక్ట్ ఇవ్వలేదని… బ్రోకర్ భార్యను కూడా చంపేస్తాడు క్యాబ్ డ్రైవర్. అసలు ఇంతకూ క్యాబ్ డ్రైవర్ ఎవరు. డ్రైవర్ ను, బ్రోకర్ ను ఎందుకు తన కార్ లో లాక్ చేశాడు. ఎందుకు మనీ గేమ్ అడుతుంటాడు. అలెగ్జాండర్ క్యాబ్ డ్రైవర్ ను పట్టుకున్నాడా లేదా. ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం థియేటర్లో సినిమా చూడాల్సిందే.

సమీక్ష
హీరో ప్రశాంత్ ఈ సినిమాకు ప్రధాన పిల్లర్ గా నిలిచాడు. విలన్ షేడ్స్ తో వెళ్లే ఈ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. క్యాబ్ డ్రైవర్ గా… డాక్టర్ ను, బ్రోకర్ ను ఆడుకునే సీన్స్ లో అదరగొట్టాడు. లుక్స్ పరంగా, ఫిజిక్ పరంగా, పెర్ ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. ఎమోషనల్ సీన్స్ లోనూ తన యాక్టింగ్ తో మెప్పించాడు. హీరోయిన్ అవంతిక మంచి క్యారెక్టర్లో నటించింది. ముఖ్యంగా హాస్పిటల్ సీన్ లో బాగా నటించింది. 
పోలీసాఫీసర్ గా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా తారకరత్న మరో ప్లస్ పాయింట్ గా నిలిచాడు. యాక్షన్ పార్టులోనూ, క్యాబ్ ను ఛేదించే సీన్స్ లోనూ అదరగొట్టాడు. జెమిని సురేష్, చిత్రం శ్రీను, షఫి సపోర్టింగ్ రోల్స్ లో మెప్పించాడు.

దర్శకుడు కథను కొత్త తరహాలో పరుగెత్తించాడు. స్క్రీన్ ప్లే పరంగాను మంచి మార్కులు కొట్టేశాడు. తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్సుకత రేకెత్తించాడు. ప్రతీ సీన్ ను చాలా కేర్ ఫుల్ గా తీసుకెళ్లాడు. ఆర్టిస్టులతో మంచి పెర్ ఫార్మెన్స్ తీసుకున్నాడు. డైలాగ్స్ విషయంలోనూ ఇంప్రెస్ చేశాడు. కాన్పెప్ట్ ని కొత్తగా ఎగ్జిక్యూట్ చేశాడు. సీరియస్ గా వెళ్తున్నా… సన్నివేశాల్లో కామెడీ పండించి రిఫ్రెష్ చేశాడు. మాస్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు. ఐటమ్ సాంగ్ కూడా పెట్టాడు. డైరెక్టర్ పీఎల్ కే రెడ్డి వైద్య రంగంలో ఉన్న అవయవాల మాఫియాను తెరపై పెట్టడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎడిటింగ్ బాగుంది. మురళీ మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం బాగుంది. రీ రికార్డింగ్ తో సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాడు. ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. మెడికల్ ఇండస్ట్రీ లో వుండే చీకటి కోణాలను ప్రధాన అంశంగా చేసుకొని తెరకెక్కిన ఈ ప్రాణం ఖరీదు మంచి రివెంజ్ డ్రామాగా నిలిచింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది.

ఓవరాల్ గా…. ఈ తరహా కథ, కథనం మనకు కొత్తగా ఉంటుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, స్టోరీ నరేషన్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కథ ఇది. సో.. గో అండ్ వాచిట్.

Rating : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here