ఎపిలో అవినీతిపై నోరు విప్పిన పవన్ కళ్యాణ్..!


మొదటిసారిగా  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై నోరు విప్పారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వంపై నమ్మకం పోతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు అదికంగా వస్తున్నాయని, ఒక సంస్థ సైతం ఈ విషయం చెప్పడం విచారకరమని ఆయన అన్నారు. రాష్ట్రం అవినీతి మయం అందన్న అబిప్రాయం రావడం బాదాకరమన్నారు. తాను గత ఎన్నికలలో పోటీచేసి ఉండాల్సిందని ,అప్పుడు మరింత గట్టిగా మాట్లాడే అవకాశం వచ్చి ఉండేదని పవన్ కళ్యాణ్ అన్నారు.వివిధ పక్షాలు పిలుపు ఇచ్చిన బంద్ కు తాము వ్యతిరేకం కాదని, అయితే శాంతియుతంగాజరగాలన్నది తమ ఉద్దేశమని పవన్ కళ్యాణ్ అన్నారు.చంద్రబాబు అనుభవం ఉన్న నేత అని మద్దతు ఇచ్చానని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *