బ్లడ్ డోనర్ల కోసం…ఫేస్‌బుక్ సరికొత్త ఫీచర్‌ లాంచ్

ఎప్పటికప్పడు కొత్త కొత్త ఫీచర్స్ ను తీసుకొస్తున్న ఫేస్ బుక్ ..ఈ సారి గొప్ప పనికి శ్రీకారం చుట్టింది. మన దేశంలో బ్లడ్ డొనేషన్‌ను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఓ సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ వల్ల బ్లడ్ బ్యాంక్స్‌తోపాటు రక్తం అవసరమైన వ్యక్తులు డోనార్లను సునాయాసంగా కలుసుకునే వీలుంటుంది.  అక్టోబర్ 1  జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా  ఈ ఫీచర్‌ను లాంచ్‌ చేయనుంది. యూజర్ల న్యూస్ ఫీడ్‌లో రక్త దాతలుగా చేరండి అనే మెసేజ్ ను ఇస్తుంది. యూజర్ బ్లడ్ గ్రూప్, ఇంతకుముందు రక్త దానం చేశారా అన్న వివరాలు అడుగుతారు. ఒకవేళ ఎవరికైనా రక్తం అవసరమైతే దానికి సంబంధించిన వివరాలను కూడా డోనర్లకు ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు అందజేస్తుంది. బ్లడ్ గ్రూప్, హాస్పిటల్ పేరు, రక్తం అవసరమైన వారి ఫోన్ నంబర్‌లాంటి వివరాలు ఇస్తారు. ఇండియాలో రక్తం కొరత చాలా ఉంది. చలా మంది రక్తం అవసరమైనపుడు డోనార్ల కోసం ఫేస్‌బుక్, వాట్సాప్‌లాంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. అలాంటి వాళ్ల కోసమే ఈ ఫీచర్ యాడ్ చేస్తున్నట్లు చెప్పారు ఫేస్‌బుక్ సౌత్ ఏషియా ప్రోగ్రామ్స్ హెడ్ రితేష్ మెహతా. ఇటు దాతలను, అటు రక్తం అవసరమైన వాళ్లను ఒక్క దగ్గరికి తీసుకురావడమే ఈ ఫీచర్ ఉద్దేశమని స్పష్టంచేశారు. డోనర్ల డీటైల్స్ సీక్రెట్ గా ఉంచనున్నారు. డీఫాల్ట్‌లో ఓన్లీ మన డీటైల్స్ సేవ్ అవుతాయి. యూజర్లే తమ టైమ్‌లైన్‌లో డోనార్ స్టేటస్‌ను షేర్ చేసుకుంటే వివరాలు పబ్లిక్ అవుతాయని తెలిపారు ఫేస్‌బుక్ ప్రోడక్ట్ మేనేజర్ హేమ బూదరాజు. ఈ ఫీచర్‌ను తొలిసారి ఇండియాలోనే లాంచ్ చేయబోతున్నారు. ఆండ్రాయిడ్, మొబైల్ వెబ్‌లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఢిల్లీ, హైదరాబాద్‌లలో ఉన్న బ్లడ్‌బ్యాంక్స్ ఫేస్‌బుక్‌లోని డోనార్లతో కనెక్ట్ కావచ్చని చెప్పారు హేమ. రానున్న కొన్ని వారాల్లో దేశంలోని అన్ని నగరాలకు ఈ అవకాశం ఉంటుంది. డోనార్ స్టేటస్ క్రియేట్ చేసుకున్న తర్వాత దగ్గర్లో ఉన్న డోనార్లకు ఫేస్‌బుక్ నోటిఫికేషన్లు ఇస్తుంది. దాతలు రక్తం అవసరమైనవారికి కాంటాక్ట్ చేయొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *