కేంద్రం చేతిలో చంద్రబాబు జుట్టు : సిపిఐ నారాయణ

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మళ్లీ విమర్శలు చేశారు. చంద్రబాబు జుట్టు కేంద్రం చేతిలో ఉందని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినంతకాలం చంద్రబాబుకు ఇబ్బంది ఉండదని, టిడిపి కేంద్రం నుంచి బయటకు వస్తే జైలుకే వెళ్లాల్సి వస్తుందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ ఆయన గందరగోళంలో ఉన్నారని నారాయణ అన్నారు. పవన్ ఎపిలో చంద్రబాబును, తెలంగాణలో కెసిఆర్ కు భజన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *