టీటీడీ బోర్డు చైర్మన్ గా మాజీ డీజీపీ జేవీ రాముడు..?

టీటీడీ బోర్డు చైర్మన్ పదవీకోసం టీడీపీ లో పోటీ దారుల సంఖ్య అధికంగా ఉండటంతో పరిశీలనలోకి జేవీ రాముడు పేరు. జేవీ రాముడు నిజాయితీ..నిక్కచ్చి సేవలను పరిగలలోకి తీసుకున్న చంద్రబాబు. టీటీడీ ఆచార్య,వ్యవహారాలకు  మచ్చ రాకూడదనే జేవీ రాముడు ఎంపిక చేయాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం. టీటీడీ చైర్మన్ ఓ కొలిక్కి తెద్దామన్న ఏదో ఓ ఆటంకం వస్తుండటంతో తాజాగా మాజీ డీజీపీ జేవీ రాముడును చంద్రబాబు పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఎన్నడూ లేని విధంగా టీడీపీకి టీటీడీ పాలకవర్గం ఎంపిక తలనొప్పిగా మారింది. దీంతో వివాదాస్పద రహితుడు, నిజాయితీ అధికారి కావడంతో టీడీపీ నేతలంతా జేవీ రాముడు పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

టీడీపీలో ముఖ్యులందరితో సాన్నిహిత్యం ఉండటం జేవీ రాముడుకు కలసివచ్చిన అంశం.

త్వరలో జరిగే మంత్రి వర్గంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *