2019 ఎన్నికల్లో తేల్చుకుందాం : వర్మ

దమ్ము-సత్తా ఉంటే 2019 ఎన్నికల్లో తేల్చుకుందామని బీజేపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. బీజేపీని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు చారిత్రాత్మక అవసరం అని మాట్లాడిన నాయకులే ప్రస్తుతం బీజేపీ నాయకులపై కుట్రలు, కుతంత్రాలు చేయడం సరికాదన్నారు. ఇకనైనా మిత్ర భేధం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పరిమి రాధ, బి.ముత్యాలరావు, నాగేంద్ర, పిల్లలమర్రి మురళీకృష్ణ, ముప్పరాజు శ్రీనివాస్‌, పాకా సత్యనారాయణ, తాడిమల్ల విజయవాణి, దేవగుప్తాపు లక్ష్మణరావు, కరుటూరి జగన్‌, లక్ష్మి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *