విశాఖలో ఘనంగా నౌకాదళ దినోత్సవం!

నౌకాదళ దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్‌ రోడ్డులోని యుద్ధ స్మారకం వద్ద తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ కరంబీర్‌సింగ్‌ ఘన నివాళులర్పించారు. 1971లో పాక్‌పై యుద్ధంలో సాధించిన విజయానికి చిహ్నంగా విజయస్థూపాన్ని నిర్మించారు. నివాళి అర్పించిన అనంతరం కరంబీర్‌సింగ్‌ నౌకాదళ సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌, పోలీస్‌ కమిషనర్‌ యోగానంద్‌ పాల్గొని పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. ఆర్కే బీచ్‌లో సాయంత్రం 4 గంటల నుంచి నౌకాదళ విన్యాసాలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *