‘మండేలా’ను ఆదర్శంగా తీసుకోవాలి..పవన్

Pawan-Kalyanప్రస్తుతం తెలుగు రాష్ర్టాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు స్పందించారు. రాజకీయాలంటే పగలు, ప్రతీకారాలు కాదని, దేన్నీ తెగేదాకా లాగొద్దని పవన్ తనదైన శైలిలో ట్విట్టర్‌లో పోస్టు చేశారు. నేటితరం నేతలు అందరూ దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్‌ మండేలాను ఆదర్శంగా తీసుకోవాలని హితవు చెప్పారు. ఆఫ్రికాలో నల్లజాతీయులను అణచివేతకు గురిచేసినా.. తెల్లజాతీయులతో నెల్సన్ మండేలా స్నేహ పూర్వకంగానే మెలిగారని పవన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నాయకులు పగలు, పంతాలకు పోతే మధ్యలో నలిగిపోయేది ప్రజలేనని, అధికారంలో ఉన్న వారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *