‘బేయర్’ రాకతో రైతుకు దన్ను

జర్మనీకి చెందిన ఆగ్రో కెమికల్స్‌ సంస్థ బేయర్ ఆంధ్రప్రదేశ్‌ రైతులకు పంట రక్షణ, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, డిజిటల్ ఫార్మింగ్ వంటి అంశాలలో సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రితో తమ ప్రతిపాదనలు ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. సన్న, చిన్నకారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, ఇప్పటికే సాగులో సాంకేతికతను మేళవించి ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. భూసార పరిక్షల్లో అధునాతన పరికరాలు, సీసీ కెమేరాలు, డ్రోన్ల సాయాన్ని తీసుకుంటున్నామని తెలిపారు. టమోటా పంటకు ప్రసిద్ధి చెందిన మదనపల్లిలో, మామిడి పంటకు ప్రఖ్యాతిగాంచిన చిత్తూరు జిల్లాలో వున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సమగ్ర ప్రతిపాదనలతో నెలరోజుల్లోగా వస్తే ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *