ప్రత్యేక హోదాపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

ప్రత్యేక హోదాపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని పెట్టుబడుదారులు వెనక్కి పోలేదు కదా? అని పేర్కొన్నారు. విజయవాడలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై తెలుగుదేశం పార్టీ నేతలు మాట మారుస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి చాలా నిధులు ఇచ్చిందన్నారు. అలాగే లోటు బడ్జెట్‌లో రుణమాఫీ, సంక్షేమ పథకాలు చేర్చారన్నారు. ఇప్పటికే 8 కేంద్ర సంస్థలు నెలకొల్పారని వీర్రాజు పేర్కొన్నారు. అలాగే చట్టంలో రైల్వే జోన్‌ను పరిశీలన చేయాలని మాత్రమే ఉందని, అయినప్పటికీ రైల్వేజోన్‌ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని వీర్రాజు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *