ప్రత్యేక హోదాకు రాజ్యసభలో 11 పార్టీల మద్దతు

chandrababunaidu-k9SC--621x414@LiveMintఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని రాజ్యసభలో 11 పార్టీలు మద్దతిచ్చాయని సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆదాయంలో తెలంగాణతో పోలిస్తే ఏపీకి తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల తర్వాత కూడా తెలంగాణతో సమానంగా ఆదాయం ఉండబొదని ఆయన చెప్పారు. ఏపీలో అర్బన్‌ ప్రాంతాలు, పరిశ్రమలు ఎక్కువగా లేవని, రెండేళ్లయినా పోలవరానికి కేంద్రం పూర్తి స్థాయిలో సాయం చేయలేదని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని ఆనాడు కేంద్రమంత్రులు జైట్లీ, వెంకయ్య డిమాండ్‌ చేశారని ఆయన గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా తప్పకుండా ఇవ్వాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *