పార్లమెంట్‌లో ప్రత్యేక హోదాపై పోరాడుతాం: వైసీపీ

ysr-party-apvarthalu-comవైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ సమావేశం ముగిసింది. భూసేకరణ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించామని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి తెలిపారు. పోలవరానికి నిధులు, ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో పారాడాలని నిర్ణయించామన్నారు. బహుళ పంటలు పండే భూముల సేకరణను తాము వ్యతిరేకిస్తున్నామని, తాము చేసే సవరణలకు కేంద్రం ఒప్పుకుంటే భూసేకరణ బిల్లుకు మద్దతు తెలుపుతామన్నారు. లేదంటే సవరణలతో డివిజన్‌ కోరాతమని మేకపాటి తెలిపారు. మరో ఎంపీ, తెలంగాణ నేత మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజేపీలు సహకరిస్తే ఏపీకి ప్రత్యేక హోదా కష్టమేమీ కాదన్నారు. పార్లమెంట్‌లో ప్రాణహిత-చేవెళ్ల జాతీయ హోదా అంశంపై, హైకోర్టు విభజనపై తమ గళం విప్పుతామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *