పనామా పేపర్లలో జగన్..!

ys-jagan-fdfd647x450బ్రిటీష్‌ వర్జిన్‌ ఐల్యాండ్స్‌లో జ‌గ‌న్‌ పెట్టుబడులు…జగన్ బినామీ రాంప్రసాద్ గురించి పనామా పత్రాలు గుట్టుర‌ట్టు చేశాయి. ఇందూ ప్రాజెక్టు, ఇందూ టెక్ జోన్, లేపాక్షి నాలెడ్జ్ హ‌బ్ కు భూములిచ్చి జ‌గ‌న్ డ‌బ్బుకూడ‌బెట్టాడు. ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి ఆ డబ్బును బ్రిటీష్‌ వర్జిన్‌ ఐల్యాండ్స్‌, మారిషస్, లక్సెంబర్గ్ లలో పెట్టుబడులు పెట్టాడు జగన్. ఇవన్నీ సిబిఐ, ఈడీలు 2013లోనే 11వ చార్జ్ షీటులో పేర్కొని జగన్, విజయ సాయిరెడ్డి, శ్యాం ప్రసాద్ రెడ్డిలతో సహా అరబిందో ప్రతినిధులపై కేసులు పెట్టారు. భూముల తాకట్టును 10వ చార్జిషీటులో, విదేశీ పెట్టుబడులు, మనీ ల్యాండరింగ్ కేసులను 9వ చార్జిషీటులో పేర్కొన్నారు. జగన్ విదేశాలలో పెట్టిన పెట్టుబడి అంతా ప్ర‌భుత్వం కేటాయించిన భూముల‌ను జ‌గ‌న్‌ బ్యాంకుల్లో తాక‌ట్టుబెట్టగా వచ్చిన సొమ్మే. ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న పనామా పేపర్స్ ఉదంతంలో రాంప్రసాద్ రెడ్డి పేరు బయటికి వచ్చింది. రామ్ ప్రసాద్ రెడ్డి విజయసాయి రెడ్డికి బినామీ. విజయసాయి రెడ్డి జగన్ కు బినామీ అని అందరికీ తెలుసు. మొత్తంగా తేలిందేమిటంటే పనామా బయట పెట్టింది జగన్ బినామీ పేరిట పెట్టిన పెట్టుబడుల విషయమే. మనీలాండరింగ్‌ ద్వారా బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్‌కు పంపిన గుట్టును పనామా పత్రాలు ధ్రువీకరిస్తున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *