దుర్గగుడి తాంత్రిక పూజలపై ముగిసిన విచారణ

విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజలపై నియమించిన నిజనిర్ధారణ కమిటీ విచారణ పూర్తి చేసింది. దేవాదాయ శాఖ కమిషనర్‌ అనురాధకు కమిటీ నివేదికను అందజేసింది. ప్రధాన అర్చకుడు భద్రీనాథ్‌తో పాటు 40 మంది ఆలయ సిబ్బంది, పూజారుల్ని కమిటీ విచారించింది. ఆగమ శాస్త్రానికనుగుణంగా పూజలు జరిగాయా లేదా అన్న అంశంపై కమిటీ ఆరా తీసింది. అలాగే ఈవో సూర్యకుమారి నుంచి పూర్తి వివరాల్ని కమిటీ సేకరించింది.ఈ రోజు సాయంత్రానికల్లా నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు కమిషనర్‌ అందజేయనున్నారు. అయితే ఈ వివాదంపై పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *