దాసరి కాంబినేషన్‌లో పవన్‌ సినిమా..!

ప్రముఖ సినిమా దర్శకుడు,రచయిత దాసరి నారాయణరావు, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో కొత్త సినిమా తెరకెక్కబోతోంది. దాసరి నిర్మిస్తున్న 37వ సినిమాలో పవన్‌ నటించనున్నారు. ఇటీవల ఇద్దరూ కలిసిన సమయంలో తమ కాంబినేషన్‌లో సినిమా చేయాలని పవన్‌, దాసరి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే దాసరి నిర్మించనున్న సినిమాలో పవన్‌ నటిస్తున్నట్లు ఒక ప్రకటన వెలువడింది. ఇదిలాఉండగా దాసరి, పవన్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుందన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయం ప్రస్తుతం తెలుగు సినీ నోట హాట్‌ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *