తుపాను బాధితులందరినీ ఆదుకుంటాం: బాబు

12279221_800015253454232_4229594070249690810_nనెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ వెంకటగరి ఎన్టీఆర్‌నగర్‌లో త్వరలో డ్రైనేజీ, సీసీ రోడ్లను నిర్మిస్తామన్నారు. చేనేత కార్మికుల మగ్గానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందిస్తామని ఆయన తెలిపారు. వరదల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేలు,పాక్షికంగా దెబ్బతింటే రూ.20 వేలు.పూరి గుడిసెలకు రూ.6,500 తక్షణసాయన్ని ప్రకటించారు. చేనేత కార్మికులకు రూ.10 వేల చొప్పు సాయం అందిస్తామని పేర్కొన్నారు. తుపాను బాధిత కుటుంబాలకు రూ.25 కిలోల బియ్యం, కిలో చొప్పున చక్కెర, కందిపప్పు, నూనె పంపిణీ చేస్తామని సీఎం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *