టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

TDP-Logoఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఇరు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా , గవర్నర్ కోటా అభ్యర్థిత్వాలను ఖరారుచేశారు.  ఏపీలో ఎమ్మెల్యే కోటాలో  జూపూడి ప్రభాకర్, షరీఫ్ కు అవకాశం దక్కింది. గవర్నర్ కోటా కింద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పి అనురాధ, టీడ జనార్ధన్, శ్రీనివాసులుకు ఎమ్మెల్సీ టికెట్లు లభించాయి. నామినేషన్ల దాఖలుకు గురువారమే చివరిరోజు కావడంతో కొంత వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ అభ్యర్థుల పేర్లను వెల్లడించక తప్పలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *