టీడీపీ ఎంపీలతో భేటీ అయిన సిఎం చంద్రబాబు

అందుబాటులోని ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం సమావేశం అయ్యారు. ఈ భేటీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్ర హామీలు, ఢిల్లీ తాజా పరిణామాలపై చర్చ ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా సహాయం చేసిందన్న బీజేపీ ప్రకటనకు ఇవాళ టీడీపీ కౌంటర్ ఇవ్వనుంది. అంకెల మాయాజాలం చేశారని విశ్లేషించిన టీడీపీ నేతలు సమగ్ర వివరాలతో ప్రజల ముందుకు రాబోతున్నారు. పక్కా ఆధారాలతో బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారానికి తెరదించాలని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఎంపీలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. బీజేపీ విడుదల చేసిన లెక్కల నిగ్గు తేల్చేందుకు టీడీపీ సిద్ధమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *