చంద్రబాబును మెచ్చుకొన్నా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డైనమిక్‌ లీడరని, ఏపీలో క్రీడల అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కొనియాడారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన ఉత్సవాల్లో కుంబ్లే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలకల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. వివేకానందుడి జీవితం నేటి తరానికి మార్గదర్శకమని, వివేకానందుడు సూచించిన మార్గాన్ని యువత అనుసరించాలని ఆయన పిలుపు ఇచ్చారు. క్రీడలు మానసిక వికాసాన్ని, క్రమశిక్షణను నేర్పుతాయని కుంబ్లే వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి కొల్లు రవీంధ్ర, ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *