కేంద్ర ఆర్థికశాఖ మంత్రి జైట్లీకి సీఎం లేఖ

ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి జైట్లీకి సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. విదేశీ సహాయ ప్రాజెక్ట్ కింద రాష్ట్రానికి నిధుల కేటాయించాలని లేఖలో బాబు విజ్ఞప్తి చేశారు. ఈఏపీ ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఆర్థికశాఖలో పెండింగ్‌లో ఉన్నాయని, ఈఏపీ కింద ప్రాజెక్టుల ఆమోదంలో తీవ్ర జాప్యం జరుగుతుందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతిపాదనల ఆమోదానికి చర్యలు తీసుకోవాలని కోరారు.ఆరు ప్రాజెక్టులకు నాబార్డు ద్వారా రూ.16725 కోట్లు ఇవ్వాలని, రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవనాల నిర్మాణానికి రూ.3341 కోట్లు.. అమరావతి గ్రీనింగ్ డెవలప్‌మెంట్‌కు రూ.1484 కోట్లు.. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు రోడ్ల నిర్మాణానికి 3200 కోట్లు.. వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.1000 కోట్లు.. రహదారులు, వంతెనల నిర్మాణానికి రూ.3200 కోట్లు.. పట్టణ నీటి సరఫరాకు రూ.4500 కోట్లు ఇవ్వాలని చంద్రబాబు లేఖలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *