కేంద్రం తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం!

కేంద్రం తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.దుబాయ్ పర్యటనలో ఉన్న  పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. లోక్‌సభ వాయిదా అనంతరం ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లోక్‌సభలో జైట్లీ ప్రకటనతో సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో నిరసనలు కొనసాగించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఎంపీలు తమ కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.లోక్‌సభలో జైట్లీ ప్రసంగానికి ముందు చంద్రబాబు ఎంపీలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.అరుణ్‌జైట్లీ ప్రసంగించేటప్పుడు వెల్‌లో నుంచి నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. జైట్లీ ప్రసంగంలో ప్యాకేజీ ప్రస్తావన లేకపోతే మాత్రం నిరసన కొనసాగించాలని ఎంపీలకు చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *