ఏపీ ప్రజల డిమాండ్లకు ట్విట్ట‌ర్‌లో రాహుల్‌ మద్దతు


కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై తెదేపా, వైకాపా ఎంపీలు పార్లమెంట్‌ ఉభయ సభల్లో నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విభజన హామీలు నెరవేర్చాలంటూ రాష్ట్ర ప్రజలు చేస్తోన్న డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలన్న ప్ర‌జ‌ల డిమాండ్లను పేర్కొంటూ ట్విట్ట‌ర్‌లో ఆయన మద్దతు ప్రకటించారు. న్యాయం జరగాలంటే అన్ని పార్టీలు ఏకమై పోరాడాలని ఈ సంద‌ర్భంగా రాహూల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఏపీకి న్యాయం జ‌రిగేవ‌ర‌కూ కాంగ్రెస్ పోరాడుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *