ఏపీకి నిధుల కొరత

ap-cm-Chandrababu-Naidu-apvarthalu-comరాష్ట్రానికి నిధుల కొరత చాలా ఎక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించలేనని బాబు తేల్చి చెప్పేశారు. ఏపీ టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు నిధులు కొరతపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రానికి నిధులు కొరత ఉన్నందున.. తాను ఎమ్మెల్యేలకు కేటాయించాల్సిన నిధులను ఇవ్వలేనన్నారు. ఒకవేళ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలుంటే తనను కలవాలని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎమ్మెల్యేల నియోజకవర్గం వ్యవహారాల్లో మంత్రులు జోక్యం చేసుకోవద్దన్నారు. కాగా అధికారులు తమ మాట వినడం లేదని పలువురు ఎమ్మెల్యేలు బాబు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన ఎన్నికల్లో పోటీ చేయాల్సింది అధికారులు కాదని, మీరు చెప్పినట్లు వారు వినాలని వ్యాఖ్యానించారు. అధికారులు చెప్పిన ప్రతిదానికి ఎమ్మెల్యేలు అంగీకరించొద్దని సీఎం సూచించారు. ప్రతి కార్యాలయంలో సంక్షేమ పథకాల పోస్టర్లపై సీఎం ఫోటో ఉండేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *