ఎమ్యెల్యే జలీల్‌ఖాన్‌ తనయుడి వీరంగం..!

విజయవాడ సిటీలో బుధవారం అర్థరాత్రి ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ గారి కూమారుడు సాహుల్‌ ఖాన్‌ హంగామా చేశాడు. వివరాలివి.. స్నేహితులతో కలిసి కారును అతివేగంతో నడిపారు. అంతేకాక సిటీలోని పాలిక్లీనిక్‌ రోడ్‌లో బైక్‌ను ఢీ కొట్టారు. కారు నడుపుతున్న కృష్ణతేజా అనే యువకుడిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ యువకుడు మద్యం సేవించి డ్రైవింగ్‌ చేసినట్లు గుర్తించారు. కాగా, ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అంతేకాక ఎమ్మెల్యే తనయుడు పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించాడు. ఆ కారును ఫొటోలు తీస్తున్న పోలీసులపై ఎమ్మెల్యే తనయుడు సాహుల్‌ ఖాన్‌ వీరంగం సృష్టించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *