ఎపికి ప్రత్యేక హోదాపై పవన్‌ కామెంట్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై జనసేన అధ్యక్షుడు,సినీహీరో పవన్ కల్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట నిలబెట్టుకుంటుందనే అనుకుంటున్నానని ఆయన అన్నారు. గత ఏడాది పార్లమెంటులో గందరగోళ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లును నెగ్గించుకుందని, దానికి బీజేపీ కూడా మద్దతు తెలిపిందని అన్నారు. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మాట ఇచ్చిందని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో మాట నిలబెట్టుకునే సమయం బీజేపీకి వచ్చిందని ఆయన తన ట్విట్టర్ వ్యాఖ్యలలో పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం, భూసేకరణ అంశాల మీద కూడా ట్విట్టర్లో తెలుగులోనే పవన్ కల్యాణ్ మరికొన్ని వ్యాఖ్యలు పెట్టారు. రైతులు కన్నీరు పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని, లేదంటే వారి ఆగ్రహానికి గురికావల్సి వస్తుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *