ఇస్రో మరో ఘన విజయం!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీర్తి కిరీటంలో మరో ఘన విజయం చేరింది. శుక్రవారం ఉదయం 9.29 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 100వ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. పీఎస్ఎల్‌వీ సీ-40 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) వాతావరణ పరిశీలక ఉపగ్రహం కార్టోశాట్-2తోపాటు మరో 30 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్ళింది. వీటి బరువు 1,323 కేజీలు. వీటిలో 28 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవి కావడం విశేషం. 42వసారి పీఎస్ఎల్‌వీ సీ-40 నింగిలోకి దూసుకెళ్తోంది. రాత్రి వేళల్లో ఫొటోలు తీయగలిగే సాంకేతిక పరిజ్ఞానం దీనిలో ఉంది. తొలి దశ విజయవంతమైంది. హీట్ షీల్డ్ ముందుగా అనుకున్నట్లుగానే వేరైంది. గత ఆగస్టులో ఈ హీట్ షీల్డ్ వేరుపడకపోవడంతో ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే. రెండో దశ కూడా నిర్ణీత సమయంలో విజయవంతమైంది. మూడో దశ 494.8 సెకండ్లలో విజయవంతమైంది. నాలుగో దశ ఇగ్నైట్ అయి, నిర్దేశిత సమయంలో ఇంజిన్ షట్ ఆఫ్ అయింది. కార్టోశాట్ 2ఎస్ అనుకున్నట్లుగానే విడివడింది. అన్ని ఉపగ్రహాలు విజయవంతంగా విడివడి నిర్దేశిత కక్ష్యల్లో చేరాయి……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *