ఇస్రో నూతన ఛైర్మన్‌గా శివన్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నూతన ఛైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త కె.శివన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

1982లో శివన్‌ ఇస్రోలో చేరారు. పీఎస్‌ఎల్‌వీ ప్రాజెక్టులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఛైర్మన్‌ పదవిలో శివన్‌ మూడేళ్ల పాటు కొనసాగుతారు.

1980లో మద్రాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఆయన ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చేశారు. అనంతరం బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ) నుంచి ఏరోస్పేస్‌లో మాస్టర్స్‌ ఇంజినీరింగ్‌ చేశారు. 2006లో ముంబయి ఐఐటీలో ఆయన ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. ఆయనకు చేసిన సేవలకు గాను ఎన్నో అవార్డులను అందుకున్నారు. మరో రెండు రోజుల్లో ప్రతిష్ఠాత్మకంగా ఇస్రో 100వ ఉపగ్రహంతోపాటు మరో 30ఇతర ఉపగ్రహాలను ప్రయోగించనుండగా ఈ అధికారిక ప్రకటన వెలువడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *