జగన్‌లా తాను మాట మార్చే వ్యక్తిని కాదు; పవన్ కళ్యాణ్

43

ప్రతిపక్ష నేత జగన్‌లా తాను మాట మార్చే వ్యక్తిని కాదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో జనసేన ఆధ్వర్వంలో పోరాట యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో జనసేనాని పాల్గొని మాట్లాడారు. బీజేపీ నాలుగేళ్లుగా మహిళా బిల్లును ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ ఇచ్చేందుకు జనసేన కట్టుబడి ఉందని ప్రకటించారు. అంతకు ముందు భీమవరంలో చెత్త డంపింగ్ యార్డును జనసేనాని పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్‌ను చూసేందుకు గ్రామస్థులు, అభిమానులు తరలివచ్చారు. వారితో కలిసి ఫొటోలు దిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here