రివ్యూ ; PSPK ‘అఙ్ఙాత‌వాసి’

653
Pawan Kalyan Agnathavasi Movie Review

ఏరా మామ సంక్రాంతి ముందే వ‌చ్చిన‌ట్లుంది?
కేలండ‌ర్లో తేదీ చూసుకొని మురిసిపోవ‌డం కాదు బావ‌….
ఆ కేలండ‌ర్ త‌యారీకి…
ఒక చెట్టును గొడ్డ‌లితో న‌రికి..
యంత్రాల్లో వేసి… ముక్క‌లు ముక్క‌లు కోసి…
గుజ్జు చేసి… పేప‌ర్ చేస్తారు.
దానికి ఎంతో మంది కార్మికులు పెద్ద యుద్ధ‌మే చేస్తారు….?
ఒరే ఏమైందిరా… నేన‌డిగేదేంటి? న‌వ్వు చెప్పేదేంటి?
అఙ్ఙాత‌వాస చూశాను
అందుకా….
అవును బావ‌!
త్రివిక్ర‌మ్ మీద ఎంతో న‌మ్మ‌కంతో పోయాను…
ప‌వ‌న్ మీద ఎంతో అభిమానంతో వెళ్లాను.
… ఎన్నో రెకమండేష‌న్స్ ఉప‌యోగించి టికెట్ సంపాదించాను.
ఇప్పుడేమైంది మామా?
ఆ యుద్ధంలో ఓడిపోయింది నేనేన‌ని అర్థ‌మైంది బావ‌.
త్రివిక్ర‌మ్ అంటే మాట‌లు సూప‌ర్‌గా ఉంటాయి క‌ద‌రా!
అదే నేనుకొన్నా కానీ అంత‌లేదు.
ప‌వ‌న్ హీరోయిజం బాగుంటుంది క‌ద‌రా!
ఏం లేదు.
కామెడీ పంచ్‌లు భ‌లే ఉంటాయ్ క‌దా?
వీక్ స్ర్కీన్‌ప్లేతో మ‌న‌కు ప‌డ‌తాయి పంచ్‌లు.
క‌థ డెప్త్‌గా ఉంటుందే!
ఆ… మ‌న‌ల్ని పూడ్చేసేంత‌.
మ్యూజిక్‌… అనిరుద్ బాగా చేశాడా?
ఆ ప‌ర్వాలేదు…
హీరోయిన్లు… ఉన్నారంతే.
మొత్తానికి ఏమంటావ్‌?
వృథా స‌న్నివేశాలు… వేస్ట్ బిల్డ‌ప్పులు… అన‌వ‌స‌ర‌మైన డైలాగులు… సినిమాను నిల‌బెట్ట‌లేవు రా!
ఇష్టానుసారం నరికితే విధ్వంసం… విచ‌క్ష‌ణ‌తో న‌రికితే యుద్ధం…  అని మ‌న‌కు చెప్పిన త్రివిక్ర‌మ్‌… త‌ను మాత్రం ఇష్టానుసారం చేశాడురా!
మ‌రిప్పుడు మ‌న క‌ర్త‌వ్యం?
ప్లాన్ బీ….
అంటే..
జై సింహా కోసం ఎదురుచూడ‌ట‌మే!
సినిమా..
విందా(బొమ‌న్ ఇరాని) సామాన్యుడుక‌ష్ట‌ప‌డి పైకి ఎదుగుతాడు.  కోట్ల‌తో పాటు శ‌త్రువుల‌నూ సంపాదిస్తాడు. బెల్లం చుట్టూ ఈగ‌లు… ఆస్తి చుట్టూ అసూయ‌ప‌రులు, ఆశ‌-ఆవేశ‌ప‌రులు చేర‌డం మామూలే.   ఆవేశ‌ప‌రులు విందాను, అత‌ని కుమారుడిని చంపేస్తారు. అత‌ని భార్య (కుష్బు) ఆస్తిని కాపాడుకోవ‌డానికి బాల‌సుబ్ర‌మ‌ణ్యం వ‌ర్స్‌స్ అభిశ‌క్తి విందా(ప‌వ‌న్‌క‌ల్యాణ్‌)ను రంగంలోకి దించుతుంది. ఆయ‌న ఆ సామ్రాజ్యంలోకి వ‌చ్చి విందాను, విందా కొడుకును చంపిందెవ‌రు? ఆ ఆస్తిని కాపాడుకోవ‌డం ఎలా? అనే ప‌నులు మొద‌లు పెడ‌తాడు. విందా భార్య‌కు, బాల సుబ్ర‌మ‌ణ్యంకు సంబంధం ఏమిటి? ఆస్తిని కాపాడాడా?  విల‌న్ల‌ను అంత‌మొందించాడా? అనేది మిగ‌తా సినిమా!
విశ్లేష‌ణ‌..
ఎలాంటి క‌థ‌నైనా త‌న బిగువైన క‌థ‌నం, పేలిపోయే పంచ్‌లు, ఆక‌ట్టుకునే స‌న్నివేశాల‌తో రంజింప చేసే త్రివిక్ర‌మ్ ఈసారి త‌న క‌లం బ‌లం చూప‌లేదు. ఏదో పొద్దుపోవ‌డానికి అన్న‌ట్లు… ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని ఆకాశానికి ఎత్త‌డానికి అన్న‌ట్లు… సాగే ఏ మాత్రం కొత్త‌ద‌నం లేని స‌న్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. ఏదో ఇంట‌ర్‌వెల్‌… క్లైమాక్స్ బాగా చేసేసి సినిమా ఆడించేయొచ్చు అనుకున్న‌ట్లు ఉంది. అత‌ని క‌లంలో ఇంక్ అయిపోయి.. అక్ష‌రాలు అర‌కొర‌గా ప‌డ్డ‌ట్టున్నాయి.
ప‌వ‌న్‌: త‌న‌కు అల‌వాటైన న‌ట‌న‌
కుష్బు :  కొంత ప‌ర్వాలేదు
అనుఇమ్మానియిల్‌, కీర్తి సురేశ్ :  పెద్ద ప్రాధాన్యం లేదు
ఆది : ప‌వ‌ర్‌ఫుల్ తుపాకిలో తుస్సుమ‌నే బుల్లెట్‌(విల‌న్‌)
రావుర‌మేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ముర‌ళీ, ర‌ఘుబాబు : న‌మిలి ప‌డేసే ట్యూయింగ్‌మ్‌లు
మేకింగ్ :   బేసిగ్గా అందంగా లేని అమ్మాయికి ఎంతో మేక‌ప్‌
త్రివిక్ర‌మ్ :  పొలం దున్ని… వాన కోసం ఎదురుచూసి.. అన్ని అయ్యాక‌… పంట కోసం ఎదురుచూశాడు. అస‌లు పొలంలో విత్త‌నం వేయ‌లేద‌ని మ‌రిచాడు.
రేటింగ్ : 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here