‘అన్నయ్య’ ఫంక్షన్ కు ‘తమ్ముడు’ రెడీ!

31

చిరంజీవి 150వ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా హాయ్ ల్యాండ్ లో జరుగుతున్న తరుణంలో… ఆ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ వస్తాడా? లేదా? అన్న అనుమానం మెగా అభిమానుల్లో తొలుస్తూనే వుంది. అంతకు ముందు చిత్ర నిర్మాత రామ్ చరణ్ కూడా బాబాయ్ ను పిలుస్తా.. రావడం.. రాకపోవడం ఆయన ఇష్టం అనేశారు. ఈ తరుణంలో.. కచ్చితంగా పవన్ ఈ ఫంక్షన్ కు రాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ వస్తున్నాడట. ఫంక్షన్లో పవనే సెంట్రాఫ్ అట్రాక్షన్. ఇప్పటికే ఈ ఫంక్షన్లో సందడి చేసేందుకు మెగా హీరోలంతా రెడీ అయిపోయారు. ఇక పవన్ ఒక్కడికోసమే అందరి ఎదురుచూపు. ఇప్పుడు పవన్ కూడా వస్తున్నాడని తెలియడంతో… మెగా అభిమానుల ఆనందానిక అవధుల్లేవ్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here