రివ్యూ: గోపీచంద్‌కి ఆక్సిజ‌న్ అందుతుందా..? 

45
ఒరే నీకు  ఇంత‌కీ ఆక్సిజ‌న్ అందిందా?  లేదా?
చివ‌రి అర‌గంట అందింది… అందుకే బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డా బావ‌.
ఈ మ‌ధ్య కాలంలో గోపీచంద్ సినిమాల‌న్నీ రొటీన్‌గా ఉంటూ … య‌మ బోర్ కొట్టిస్తున్నాయ్‌.. లౌక్యం త‌ర‌వాత చెప్పుకోద‌గ్గ సినిమా  లేదు.
అవును రా! ఏదో దీనిపేరు వైరైటీగా  ఆక్సిజ‌న్   అంటే వెళ్లాను.
ఇంత‌కీ క‌థేంటి?
ఒక ఊరిలో ఊరికి పెద్ద ఆయ‌న కుటుంబం… ఆ కుటుంబానికి అల్లుడవ్వ‌డానికి వ‌చ్చే  హీరో…  పెళ్లి చేసుకుంటే ఇంటిని వ‌దిలిపెట్టి పోవాల్సి వ‌స్తుంది కాబ‌ట్టి హీరో ఇష్టం లేని హీరోయిన్(రాశీ ఖ‌న్నా)…  మ‌న హీరో మంచి ల‌క్ష‌ణాలు చూసి ఇంట్లో వాళ్లంద‌రికీ న‌చ్చుతాడు.  హీరోయిన్‌కు త‌ప్ప‌…!
ఊర్లో త‌మ కుటుంబానికి లోక‌ల్ శ‌త్రువు. వాడి నుంచి త‌న కుటుంబ స‌భ్యుల‌ను కాపాడ‌టంతో హీరోయిన్ను లైక్ చేసేస్తుంది.
ఒరే బావ‌… అపు… ఇలాంటి సినిమాలు ఎన్ని చూడ‌లేదు?
అప్పుడే క‌థ అయిపోలేదు. ఇంట‌ర్‌వెల్ వ‌చ్చే ట్విస్టుతో హీరోయిన్‌కు షాక్‌…  హీరో రివైంజ్ తీర్చుకోవ‌డానికి త‌మ ఇంటికి వచ్చాడ‌ని అర్థం అవుతుంది.
ఆ త‌ర్వాత హీరోయిన్‌కు త‌న ఫ్లాష్‌బ్యాక్ చెబుతాడు హీరో.  క‌ట్ చేస్తే హీరో ఒక మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌…
అత‌నికి అంద‌మైన కుటుంబం.  అందులో త‌మ్ముడు…  హీరోకు ఫ్లాష్ బ్యాక్ అంటే మ‌రో హీరోయిన్ ఉండాలిగా… ఉంది(అనుఇమ్యానియ‌ల్‌).
అనుకీ, గోపీకి కొద్దిసేపు ల‌వ్ స్టోరీ. ఆ త‌ర్వాత త‌మ్ముడికి క్యాన్స్‌ర్‌… అది భ‌రించ‌లేక అత‌ను చ‌నిపోతాడు. దీనికి కార‌ణం  అత‌ను తాగుతున్న సిగ‌రెట్టు అని గోపీచంద్‌కి తెలుస్తుంది.
ఒరే ఇక చాలురా భ‌రించ‌లేకున్నా!
ఇప్పుడే బావ క‌థ మొద‌ల‌య్య‌ది…!
అస‌లు త‌మ్ముడి మ‌ర‌ణానికి కార‌ణం ఏమిటి?  సిగ‌రెట్ త‌యారు చేస్తున్న‌దెవ‌రు?  దీనికి రాశీఖ‌న్నా కుటుంబానికి సంబంధం ఏమిటి? మ‌ధ్య‌లో హీరో ప‌గ ఏమిటి? ఇవ‌న్నీ అక్క‌డ క‌నెక్ట్ అవుతాయి…
అప్ప‌టికే ప్రేక్ష‌కుడు సహ‌నం కోల్పోయి ఉండ‌టంతో చివ‌ర్లో వ‌చ్చే మంచి మెసేజ్‌నూ విన‌డు.
అంటే చివ‌రి అర‌గంటా సినిమా చూడొచ్చ‌న్న మాట‌…
అవును రా! నువ్వు గానీ వెళితే… ప్లాన్ చేసుకొని… చివ‌ర్లో వెళితే స‌రిపోతుంది…
ఇంత‌కీ సంగీతం… గోపీచంద్ న‌ట‌న‌… మిగ‌తా న‌టుల ప్ర‌తిభ గురించి చెప్ప‌లేదు….
జ‌గ‌తిబాబు, బ్ర‌హ్మాజీ, అశిష్ విద్యార్థి… ఇలా అంద‌రూ క‌థ‌కు త‌గ్గ‌ట్లే న‌టించారు…. అంత‌కు మించి వారికి చేయ‌డానికి ఏమీ లేదు.
కామెడీ లేదా?  పాటలు
ఉందీ అక్క‌డ‌క్క‌డా…. అలీ రొటీన్ కామెడీ… తాగుబోత ర‌మేష్‌, వెన్నెల కిషోర్ ఉన్నా ప్ర‌యోజ‌నం లేదు.
గోపీచంద్ అంటేనే ఫ్లైట్లు క‌దా!
అవును ఫ్లైట్లు ఉన్నాయంతే!
ద‌ర్శ‌క‌త్వం మాటేంటి?
ఒక‌ప్పుడు గొప్ప‌ సినిమాలు తీసిన ఏ.ఎం. ర‌త్నం కొడుకు… ఏ ఎం జ్యోతి కృష్ణ దీనికి ద‌ర్శ‌కుడు… ఎంచుకున్న అంశం మంచిదే. దాన్ని చెప్పిన విధానం బాగాలేదు.  మొద‌టి స‌గంలో మంచిగా క‌న్పించే పాత్ర‌ల‌న్నీ చివ‌రాఖ‌రుకు చెడ్డ‌విగా మార‌డం…  ఏ పాత్ర‌కు నిర్ధిష్ట ల‌క్ష్యం లేక‌పోవ‌డం…. అస‌లు చెప్పానుకున్న అంశానికి… క‌థ‌నం న‌డిచే నేప‌థ్యానికి పొంత‌నే కుద‌ర‌క‌పోవ‌డం…  ప్రేక్ష‌కుణ్ని అసంతృప్తికి గురిచేస్తాయి.
ఇంత‌కీ ఏమంటావ్‌?
ప్లేట్ నిండా చింత‌కాయ ప‌చ్చ‌డి ఒడ్డించి… అందులో ఒక చికెన్ ముక్క‌, ఒక స్పూన్ రైస్ వ‌డ్డిస్తే ఎలా తింటాం?
రేటింగ్ : 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here