రివ్యూ: యూత్ ఫుల్ ఎంటర్టైనర్.. ఓ పిల్లా నీవల్లా!

217

 

O Pilla Nee Valla-apvarthalu-comనటీనటులు: కృష్ణ చైతన్య, రాజేష్ రాథోడ్, షాలు, మౌనిక తదితరులు
సంగీతం:
సినిమాటోగ్రఫీ:
నిర్మాత-దర్శకత్వం: కిశోర్
రేటింగ్: 3/5
యువతను ఆకట్టుకునే ప్రేమకథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఇప్పుడొస్తున్న యూత్ బేస్డ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్టవుతున్నాయని చెప్పొచ్చు. అందుకే తాజాగా ముగ్గురు యువకులు కలిసి ‘ఓ పిల్లా నీవల్ల’ అనే చిత్రంలో నటించారు. ముగ్గురు మూడు నేపథ్యాలున్న కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కిశోర్.. ఈచిత్రానికి దర్శకత్వం.. నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం యూత్ ను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: రాజేష్(రాజేష్ రాథోడ్)… అవంతిక(మౌనిక) ఇద్దరూ క్లాస్ మేట్స్. ఒకరినొకరు అమితంగా ఇష్టపడుతుంటారు. ఒకరి ప్రేమను మరొకరు గౌరవిస్తారు. ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరుగుతారు. ఇలా వీరి ప్రేమాయణం సుఖాంతంగా వెళుతున్న తరుణంలో సీకే అలియస్ కృష్ణ చైతన్య వచ్చి బ్రేకులు వేస్తాడు. తన ప్రేయసి సాలును వేరే యువకుడొచ్చి వేధిస్తాడు. ఆ యువకుడికి బుద్ధి చెప్పే తరుణంలో.. అది కాస్తా.. రాంగ్ టర్న తీసుకుని రాజేష్… అవంతిక ప్రేమ వ్యవహారం బ్రేకప్ కావడానికి కారణం అవుతుంది. మరి రాజేష్… అవంతిక ప్రేమాయణం ఎలాంటి టర్న్ తీసుకుంది… చివరకు వీరి ప్రేమ ఫలించిందా అనేదే మిగతా కథ.

కథ.. కథనం: లవ్.. యూత్ ఎంటర్టైనర్ ఎప్పూడూ ఫ్రెష్ గానే వుంటుంది. అలాంటి యూత్ ఎంటర్టైన్ మెంట్ ను తెరకెక్కించాడు దర్శకుడు కిశోర్. తను చూసిన కొన్ని రియలిస్టిక్ స్టోరీ లైన్ తీసుకుని… దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఎక్కడా బోరింగ్ ఫీలవ్వకుండా ప్రేక్షకుడు.. సీటులో అలా కూర్చిండిపోతాడు. అంతటి ఇంట్రెస్టింగ్ స్టోరీని తెరకెక్కించాడు దర్శకుడు కిశోర్. కాలేజీ అంటే కేవలం చదువులే కాదు.. అక్కడ పుట్టే తొలి ప్రేమను పొందాలంటే.. యువకులు ఏం చేయాలి… వారి మనస్సును ఎలా గెలుచుకోవాలనేది దర్శకుడు చక్కగా చూపించారు.
ఓ ప్రేమికుల జంటకు వచ్చిన సమస్యను ఎలా అధిగమించారు? దానివల్ల ఆ జంట ఎదుర్కొన్న ఇబ్బందులేవీ అనే నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఏమరుపాటు తనం ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందనే ఎలిమెంట్ ను బేస్ చేసుకుని దర్శకుడు కిశోర్ రాసుకున్న కథ.. కథనం చాలా బాగుంది. ఓ చిన్న మిస్ అండర్ స్టాండింగ్ తో ఓ యువ జంట విడిపోవడానికి కారణమైన వ్యక్తి… తను చివరకు ఎలాంటి విపరీత పరిణామాలను ఎదుర్కొన్నాడు.. చివరకు వీరి కథ ఎలా సుఖాంతమైంది అనేదానిని దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు.
ప్రధాన పాత్రలు పోషించిన రాజేష్ రాథోడ్… మౌనిక, క‘ష్ణ చైతన్య-షాలు తదితరులు తమకు ఇచ్చిన పాత్రల మేరకు చక్కగా నటించారు. వీరి జంటలు ఆద్యంతం అలరిస్తూనే వుంటాయి. గతంలో చిన్నా చితకా సినిమాలు చేసిన వీరు.. ఈ చిత్రంతో రెఫరెన్స్ లు కూడా ఇచ్చుకోవచ్చనే విధంగా ఈ చిత్రం వుంది. హీరోలు గా నటించిన ముగ్గురు యువకులు చక్కగా నటించారు. మంచి ఫ్యూచర్ వున్న ఈ యువ నటులు బేషాజాలకు పోకుండా.. నటనకు ప్రాధాన్యం వున్న చిత్రాల్లో నటిస్తే.. తప్పకుండా ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ వ్యక్తులుగా నిలిచిపోతారు. వారికి జంటగా నటించిన మౌనిక.. సాలు కూడా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్నారు. కచ్చితంగా యూత్ ఈ చిత్రాన్ని చూసి తీరాలి. ప్రీ క్లైమాక్స్ తో పాటు.. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్.. ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.
చివరగా… పిల్లా నీవల్ల సినిమా.. యూత్ తప్పకుండా చూడాలి. దర్శకుడు ఎంచుకున్నకథ.. కథనం బాగుంది. దీనిని నటీనటులు చక్కగా తెరమీద చూపించారు. సినిమాటోగ్రపీ భాగుంది. యువ జంటలను చక్కగా చూపించారు. నిర్మాత కూడా ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేశారు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా వున్నాయి. నిడివి కూడా క్రిస్స్ గా వుండటంతో యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. సుదర్శన్ కామెడీ.. సూర్య శ్రీనివాస్ స్టోరీ టెల్లింగ్ బాగా ఆకట్టుకుంటుంది. తప్పకుండా ఈ చిత్రం యువతను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు.
చివరగా…  ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్..పిల్లా నీవల్లా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here