రివ్యూ : ‘జై లవకుశ’

224

సినిమా : జై లవ కుశ

బ్యానర్ : ఎన్టీఆర్ ఆర్ట్స్

నిర్మాత : కళ్యాణ్ రామ్

దర్శకుడు : కేఎస్ రవీంద్ర (బాబీ)

సంగీతం : దేవిశ్రీప్రసాద్

ఛాయాగ్రహణం : ఛోటా కే నాయుడు

నటీనటులు :

జూనియర్ ఎన్టీఆర్ , రాశీఖన్నా, నివేదా థామస్‌, అభిమన్యుసింగ్ , సాయి కుమార్, బ్రహ్మాజీ తదితరులు..

వరస హీట్లు తో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్… ఇప్పుడు తాజా చిత్రం ‘జైలవకుశ’ మీద ఎన్ని అంచనాలున్నాయో అందరికీ తెలుసు. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత తారక్ చేసిన చిత్రం కావడం, అలాగే కెరీర్‌లో తొలిసారి ఈత్రిపాత్రాభినయం పోషించడంతో ఈ చిత్రానికి మొదటి నుంచి ఫుల్ క్రేజ్ ఉంది. ఆ కారణంగానే ఈ మూవీ ఏకంగా నూటాపాతిక కోట్లకు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక మూడు పాత్రలకు సంబంధించిన టీజర్స్, ట్రైలర్ ద్వారా ఈ చిత్రం మరిన్ని ఆశలు రేకెత్తించింది. ముఖ్యంగా.. నెగెటివ్ షేడ్స్ వున్న ‘జై’ పాత్ర హైలైట్ కావడంతో, అది అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలా తారాస్థాయి అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం.. ప్రేక్షకులను ఏ మేరకు ఆకర్షించిందో చూడాలి.

కథ :

ఒక తల్లికి జై, లవ, కుశ అనే ముగ్గురు కవలపిల్లలు పుడతారు. చిన్నప్పుడు ఎంతో అన్యోన్యంగా కలిసి వుంటారు. కానీ.. కొన్ని అనుకోని కారణాల వల్ల ‘ వాళ్ళు విడిపోతారు. లవ బ్యాంకు ఎంప్లాయ్ గా చేస్తుంటాడు, కుశ అల్లర చిల్లర పనులు చేస్తూ అందరిని అలరిస్తుంటాడు. ఇద్దరు తమతమ స్థానాల్లో బతుకున్న వీరి జీవితాలు అనూహ్యంగా మలుపులు తిరుగుతాయి. దీంతో లవ, కుశలు ఇబ్బందుల్లో పడిపోతారు. బ్యాంకు లో డబ్బు పోతుంది, ప్రియ (రాసిఖన్నా) మిస్ అవుతుంది. అది ఎవరు చేసారు ఎందుకు చేసారు అన్నది సినిమాలోనే చూడాలి. తాము ఇలా కష్టాల్లో ఇరుక్కోవడానికి కారణం తమ సోదరుడు ‘జై’ అని వీరికి కొన్ని సూచనలు అందుతాయి. ఆ తర్వాత వీరు ఏం చేశారు? అసలు అన్యోన్యంగా వున్న వీళ్లు ముగ్గురు ఎందుకు విడిపోయారు? జై ఎందుకు రావణుడిలా క్రూరంగా మారాడు? వీరికి కష్టాలు రావడం వెనుక ఎవరి హస్తం వుంది? అనే అంశాలతో ఈ చిత్రం సాగుతుంది.

విశ్లేషణ: 

ఇప్పుడు వస్తున్న అన్ని సినిమాల్లాగా ఎవ్వరూ ఊహించని స్టోరీలైన్‌తో ఈ చిత్రం తెరకెక్కిందని, దీన్ని డైరెక్టర్ బాబీ చాలా అద్భుతంగా మలిచాడు. ఇంతవరకు ఏ డైరెక్టర్ చేయని సాహసం బాబీ చేసి, తారక్‌లో దాగివున్న నటనాప్రతిభను అందరి దర్శకుల కంటే కొంచెం ఎక్కువే బయటకు తీసాడు. అసలు ఇలాంటి స్టోరీ రాసినందుకే బాబీకి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు , దాన్ని సినిమాగా మలిచిన తీరు కూడా అభినందనీయం. డైరెక్టర్‌గా తన సత్తా ఏంటో బాబీ జై లవకుశ సినిమా తో నిరూపించుకున్నాడు.

ఇక స్టోరీ పరంగా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం లవ, కుశల ట్రాక్‌లతోనే ఎక్కువ భాగం సరదాగా సాగిపోతుంది. లవ తన అమాయకత్వంతో ప్రేక్షకుల హృదయాలను అలరిస్తే, కుశ తన అల్లరి చేష్టలతో అందరి హృదయాలని దోచేస్తాడు. అసలు కుశ చేసిన అల్లరే ఫస్టాఫ్‌లో హైలైట్ , ముఖ్యంగా బ్యాంకులో లవగా కుశ చేసిన హంగామా మామూలుగా లేదు. అయితే.. లవగా కుశ ఎందుకు బ్యాంకులోకి వచ్చాడన్నదే ఇక్కడ ట్విస్ట్. అది తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే. ప్రీ-ఇంటర్వెల్ వరకు సరదాగా సాగే సినిమా ఒక్కసారిగా అనూహ్య మలుపు తీసుకుంటుంది. అక్కడినుంచి కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది. జై ఎంట్రీ అదిరిపోయే రేంజులో ఉంది ఆ సీన్‌కి థియేటర్లు మార్మోగిపోవడం ఖాయం. రావణ మహారాజ్ గా తారక్ పిచ్చేకించాడు. ఇంక సినిమా సెకండ్ హాఫ్ కూడా చాలా నీట్ గా తెరకెక్కించాడు దర్శకుడు బాబీ. నివేతా థామస్ సెకండ్ హాఫ్ లోనే ఎంట్రీ ఇస్తుంది. తన క్యూట్ క్యూట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంది.

నటీనటులు: 

తారక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంది? ఏ పాత్ర ఇచ్చిన అందులో జీవించేయడం తారక్‌కి వెన్నతోపెట్టిన విద్య. ఇందులో అయితే అరాచకం అంతే. లవగా అమాయకుడి పాత్రలో మైమరిపించి, కుశతో అలరించిన తారక్.. ‘జై’ క్యారెక్టర్‌లో నవయుగ రావణుడిగా ఇరగదీసేశాడంతే. వెండితెరపై చూస్తున్నంతసేపూ ఆ పాత్రల్లోనే లీనమైపోతామే తప్ప.. తారక్ మాత్రం అస్సలు కనిపించడు. అంతలా ఎన్టీఆర్ ఆ మూడు పాత్రల్లో జీవించేశాడు. ఇక రాశీఖన్నా, నివేదా థామస్‌లు అందంగా కనిపించడంతోపాటు అభినయంతోనూ ఆకట్టుకున్నారు. ఫస్టాఫ్‌లో రాశీ, సెకండాఫ్‌లో నివేదా తమ మార్క్ యాక్టింగ్‌తో ప్రత్యేకత చాటుకున్నారు.ముక్యంగా నివేతా గురించి చెప్పుకోవాలి. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరిని మంత్ర ముగ్డులని చేస్తుంది. మిగతా నటీనటులు తమతమ పాత్రల పరిధి బాగానే నటించారు.

సాంకేతికవర్గం: 

ఛోటా కే నాయుడు తన సినిమాటోగ్రఫీతో ఈ చిత్రాన్ని మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు. కొన్ని సందర్భాల్లో అతని కెమెరా వర్క్ కి ఆశ్చర్యపోతాం. ప్రతి సన్నివేశాన్ని చాలా గ్రాండ్‌గా చూపించిన ఛోటా.. హీరో ఎలివేషన్ సీన్ల దగ్గర అదుర్స్ అనిపించాడు. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే మూడ్‌కి తగ్గట్టు చితక్కొట్టేశాడు. ఎడిటర్, ఆర్ట్ వర్స్ బాగానే కుదిరాయి కాని కొంచెం కత్తెరకి పదును పెట్టాల్సింది. కళ్యాణ్ రామ్ నిర్మాణ విలువలకు వంక పెట్టడానికి లేదు. తమ్ముడితో తొలిసారి సినిమా చేసినందుకు ఏమాత్రం వెనకాడకుండా భారీ ఖర్చు చేశాడు.

ఇక దర్శకుడు బాబీ గురించి మాట్లాడుకుంటే.. తాను రాసుకున్న స్టోరీని వెండితెరపై అద్భుతంగా మలచడంలో సక్సెస్ అయ్యాడు. తారక్‌ని ఫుల్లుగా వాడుకుని, అతనితోనే సినిమాని బాగా రన్ చేశాడు. కొన్నికొన్ని చోట్ల ఏదో మిస్ అయినట్లు అనిపిస్తుంది గానీ.. ఓవరాల్‌గా మాత్రం దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు.

ప్లస్ లు:

తారక్ విశ్వరూపం నివేతా, రాశిఖన్నా క్యూట్ లుక్స్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు, ఇంటర్వెల్ సన్నివేశం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ,పాటలు తెరకెక్కించిన విధానం. సినిమాటోగ్రఫీ,నిర్మాణ విలువలు

మైనస్ లు: 

కొన్ని చోట్ల సాగతీత గా అనిపించే సన్నీ వేషాలు రోటీన్ కామెడీ ఎడిటింగ్ వర్క్ ఇంకా చేయాలి. కొన్ని చోట్ల సాంకేతిక పరమైన లోపాలు ఉండటం.

చివరగా :

జై నటనకి జై కొడతారు. లవ కుమార్ తో లవ్ లో పడతారు. కుశ చిలిపితనం తో కుష్ అవుతారు. తారక్(రావణ)మహారాజ్ నట విశ్వరూపాన్ని చూస్తారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ.

రేటింగ్: 3.5/ 5

– నాగరాజు చౌదరి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here