యూత్ ను మెప్పించే ‘నిన్ను తలచి’

37

నూతన హీరో వంశీ యాకసిరి, స్టెపీ పటేల్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు అనిల్ తోట తెరకెక్కించిన చిత్రం “నిన్ను తలచి”. ఎస్.ఎల్.ఎం ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

అభిరామ్ (వంశీ యాకసిరి) అల్లరిచిల్లరగా తిరుగే ఎబౌవ్ మిడిల్ క్లాస్ కుర్రాడు. అయితే అంకిత (స్టెపీ పటేల్)ని చూసిన తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఆ తరువాత ఆమెను ప్రేమలో పడేయడానికి అభి ఏమి చేశాడు ?మరి అంకిత అభితో ప్రేమలో పండిందా ? ఆ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అంకిత మనసులో వేరే అతను ఉన్నారని అభికి తెలుస్తోంది ? దాంతో అభి ఎమి చేశాడు ? అసలు అంకిత మనసులో ఉన్నది ఎవరు ? చివరికి అంకిత – అభి ఒక్కటయ్యారా ? లేదా ? ఒక్కటైతే వాళ్లిద్దరూ ఎలా కలిశారు ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

విశ్లేషణ:

అనిల్ తోట దర్శకత్వంలో ఎమోషనల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో కొన్ని లవ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వంశీ తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు.కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చాడు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో అలాగే డాన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ నటించిన స్టెపీ పటేల్ పర్వాలేదనిపిస్తోంది. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన నటుడు తన కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో సినిమాలో కనిపించనంత సేపూ నవ్వించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

యూత్ ను ఆకట్టుకునే అంశాలు, డైలాగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా లవ్ ట్రాక్ ఆడియన్స్ ను అలరిస్తుంది. సాంగ్స్ బాగున్నాయి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది.

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. ముందు చర్చించుకున్నట్లుగానే దర్శకుడు అనిల్ తోట ఆకట్టుకునే విధంగా కథా కథనాన్ని రాసుకున్నాడు. ఇక సత్య సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను ఆయన చాలా అందంగా చూపించారు.

ఇక సంగీత దర్శకుడు మహావీర అందించిన సంగీతం బాగుంది. సాయి ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాతలు నేదురుమల్లి అజిత్ కుమార్ , మోదిగిరి ఓబులేష్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

వంశీ యాకసిరి, స్టెపీ పటేల్ హీరోహీరోయిన్లుగా అనిల్ తోట తెరకెక్కించిన ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. అయితే అక్కడక్కడా రేర్ గా వచ్చే కొన్ని లవ్ అండ్ కామెడీ సీన్స్ పర్వాలేదనిపించినా.. కథా కథనాలు ఆసక్తికరంగా ఉన్నాయి, సినిమాలో బలమైన సంఘర్షణ మరియు సరైన ప్లో ఉండడంతో బోర్ కొట్టదు. ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని అలరిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

రేటింగ్: 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here