పెరిగిన తిరుపతి లడ్డూ ధర…సామాన్య భక్తులకు భారమే!

 

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి దైవ ప్రసాదాన్ని వ్యాపారంగా మార్చేయడం భాధాకరం.సిఫార్సుల మీద వెళ్లే వాళ్లకు లడ్డూ ధర పెంచితే ఫర్వాలేదు. ఎందుకంటే..ఆర్థికంగా వారు స్థితిమంతులు. వారికి ఇబ్బంది ఉండదు. సామాన్య భక్తులకు మాత్రం పెరిన ధర భారమే.ఈ విషయంపై టీటీడీ కమిటీ మరోసారి ఆలోచన చెయ్యాలి. చిన్న లడ్డూ ధర ₹ 25 నుండి ₹ 50, కళ్యాణ లడ్డూ ధర ₹ 100 నుండి ₹ 200, వడ ధర ₹ 25 నుండి ₹ 100 పెంచారు. టీటీడీ కి రావడానికే అష్టకష్టాలు పడతారు సామాన్య భక్తులు.ఒక లడ్డూ ప్రసాదాన్ని పది మందికి పంచి మధురానుభూతి పొందుతారు. అలాంటిది ఒక్క లడ్డూ కూడా కొనని స్థితిలో ధర ఉంటే వారేం చేయగలరు? ఏడుకొండలవాడా నీ ప్రసాదం కూడా మాకు దక్కనీయండ లేదయ్యా అంటూ..ఇక వేడుకోవడమే సామాన్య భక్తుల పని. ఇక మిగిలింది ఇదే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *