ప్రజల కోసం దెబ్బలు తింటా…అవసరమైతే జైలుకెళ్తా!


సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో ఇబ్బందులు వచ్చాయని, అయినా ఆ సమయంలో సహాయం కోసం తాను ఎవరినీ కలవలేదని జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తెలిపారు. విశాఖ పోర్టు స్టేడియంలో జరిగిన డీసీఐ ప్రైవేటీకరణ వ్యతిరేక రిలే దీక్షలో పవన్ పాల్గొన్నారు.

డీసీఐను ప్రయివేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షకు మద్దతు తెలిపిన పవన్..

డీసీఐ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పవన్ ప్రసంగిస్తూ.. తన సొంత పనుల కోసం తాను ఎప్పుడూ, ఎవరి వద్దకూ వెళ్లలేదని, కేవలం ప్రజల సమస్యలు తీర్చడానికే పోరాటం చేస్తానని చెప్పారు.

‘‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బందులొస్తాయని బెదిరిస్తున్నారు. నన్ను ఏం చేస్తారు? ప్రజల కోసం దెబ్బలు తింటా. అవసరమైతే జైలుకెళ్తా.

నాకు భయం లేదు. ధైర్యం ఉంది. దెబ్బలు తిన్నవాడు ఎదురుతిరిగితే ఎలా ఉంటుందో చూపిస్తా.’’ అని పవన్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *