400ఎకరాల భూసేకరణకు నోటీసులు…రోడ్డు పై రైతులు ఆందోళన!

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలోని లాండ్ పూలింక్ ఇవ్వని 600 ఎకరాలకుగాను గుంటూరు జిల్లా కలెక్టర్ ఈ రోజు 400 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ పెనుమాక రైతులు సీ. ఆర్. డిఎ కార్యాలయం ఎదుట నల్ల జెండాలు చెప్పట్టి రోడ్డు పై బైఠాయించి ధర్నా చేశారు. కలెక్టర్ చేసినా తీరును నిరసిస్తూ కలెక్టర్ ఢాం. ఢాం. అంటు నినాదాలు చేశారు. ప్రాణలు పోయినా మా భూమి వదలుకోమని అవసరం అయితే ప్రభుత్వం పైన కోర్టు లో కేసులు వేస్తామని, కలెక్టర్ పైన కూడా సుప్రీంకోర్టు లో కేసు వేస్తాం అన్ని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *