కాపుల చిరకాల వాంఛ తీరింది …!

కాపులను బీసీల్లో చేర్చాలని మంత్రి మండలి తీర్మానించడం, దానిని ఉభయ సభల్లో ఆమోదించడంతో కాపుల చిరకాల కోరిక తీరిందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హ‌ర్షం వ్యక్తం చేశారు. స‌మావేశాలు అసెంబ్లీ ముగింపు అనంత‌రం శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద శనివారం సాయంత్రం పలువురు కాపు నేత‌ల‌తో కలసి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిఠాపురంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ కమిషన్ ఏర్పాటు చేయ‌డంతో పాటు నివేదిక తెప్పించుకొని మంత్రి మండలి, ఉభయ సభల్లో ఆమోదింపజేశారని కృతజ్ఞతలు తెలిపారు. దీంతో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు మేలు జరుగుతుందన్నారు. మంజునాథన్ కమిషన్‌లోని మెజార్టీ ముగ్గురు సభ్యులు నివేదిక ఇచ్చినట్లు పేర్కొన్నారు. బీసీలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రిజర్వేషన్ కల్పించనున్నట్లు చెప్పారు. దీనిని 9వ షెడ్యూల్ చేర్చడానికి ముఖ్యమంత్రి, బిజేపీ నాయకులు ప్రయత్నిస్తారని వెల్ల‌డించారు. మంత్రి మండలిలో బీజేసీ మంత్రులు కూడా ఉన్నట్లు చినరాజప్ప తెలిపారు. విలేక‌రుల స‌మావేశంలో కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *