అంగన్‌వాడీకీ ఆధార్‌..యోచనలో కేంద్రం!

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆహారం తినే పిల్లలకు కూడా ఆధార్‌ తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటున్నట్టు ‘నవతెలంగాణ’ వార్తా కథనం తెలిపింది.

అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే మహిళలను పర్యవేక్షించేందుకుగాను నూతన విధానం ప్రారంభించడానికి 12 అంకెల గుర్తింపు సంఖ్య అవసరమని భావిస్తోంది.

‘నకిలీ పిల్లలను’ తొలగించడానికి, వనరుల వృథాను తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మేనకాగాంధీ చెప్పారు.

అస్సాంలో ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో రిజిష్టరైన పేర్లలో మూడు లక్షలు నకిలీవని అధికారులు గుర్తించారనీ.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆమె తెలిపారు.

ఆధార్‌ కార్డు ఉన్న పిల్లలకు ఏ అంగన్‌వాడీ కేంద్రంలోనూ సేవలు నిరాకరించబోమని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్‌ శ్రీవాస్తవ అన్నారు.

ఆధార్‌కార్డు లేని పిల్లలకు వాటిని ఆయా కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్లు వాటిని ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం వారికి రూ. 500 ప్రోత్సాహాన్ని ఇస్తామన్నారు.

‘పిల్లలు ఇప్పుడు అంగన్‌వాడీ కేంద్రాలలో ఆధార్‌ కార్డులను పొందవచ్చు. 6 నెలలలోపున్న పిల్లలకు కూడా తల్లి ఆధార్‌ కార్డుకు అనుసంధానం చేయడం ద్వారా ఆధార్‌ నెంబరును ఇస్తారు’ అని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *