రివ్యూ: ఇది యువతకు మెసేజ్ ఇచ్చే రకం

263

Rating: 3.25/5
తారాగణం: సాయిరామ్ శంకర్, రేష్మీ మీనన్, శరత్ కుమార్, ఎం.ఎస్.నారాయణ, పృథ్వీ, వైవా హర్ష, ఆదిత్య మీనన్ తదితరులు
సంగీతం: మహిత్ నారాయణ్
నిర్మాత: శ్రీకాంత్ రెడ్డి
కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుదర్శన్ సలేంద్ర

143 మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సాయిరామ్ శంక్… ఆ తరువాత బంపర్ ఆఫర్ లాంటి హిట్టు సినిమాలో నటించి మెప్పించాడు. మొదట్లో పూరీ వద్ద దర్శకత్వం శాఖలో పనిచేసి… ఆ తరువాత నటన మీద వున్న ఆసక్తితో తెలుగు ఇండస్ట్రీలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నాడు. మొన్నామధ్య విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ ‘అరకు రోడ్డులో’ మూవీలో నటించాడు. ఇది గతంలో సాయిరామ్ శంకర్ నటించిన రెగ్యులర్ ఫార్మాట్ కి భిన్నమైన సినిమానే అని చెప్పొచ్చు. తాజాగా ‘నేనోరకం’ అనే మూవీలో నటించాడు. ఇది కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. మరి ఈ డ్రామా ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
స్టోరీ: గౌతమ్(సాయిరామ్ శంకర్) అనే కుర్రాడు పండగ అనే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అతడు స్వేచ్ఛ(రేష్మీ మీనన్) అనే అమ్మాయిని చూసి తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. ఆమె ప్రేమను పొందడానికి రికవరీ ఏజెంటు పాత్రలో చాలా వేషాలే వేసి.. ఆమె ప్రేమను పొందుతాడు. అయితే మధ్యలో వచ్చిన చిన్న గ్యాప్ వల్ల… ఇద్దరూ దూరమై ఆ తరువాత కలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ఇలా ఒకరినొకరు కలుసుకోవాలని చూస్తున్న క్రమంలో స్వేచ్ఛను.. గౌతమ్ కళ్లముందే కిడ్నాప్ చేసి తీసుకెళతారు. ఇలా కిడ్నాప్ కు గురైన స్వేచ్ఛ ఆచూకీ గౌతమ్ కనుగొన్నాడా? అసలు ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారు? కిడ్నాపర్ ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్టోరీ విశ్లేషణ: సాయిరామ్ శంకర్ తెలుగు ఇండస్ట్రీలో హీరోగా నటించబట్టి దశాబ్దం దాటిపోయింది. తన కెరీర్లో 143, బంపర్ ఆఫర్ లాంటి సినిమాలు చేశాడు కానీ.. సాయిరామ్ కు అంత గుర్తింపు అయితే తీసుకురాలేదు. నేనింతే సినిమాలో సినిమా లవర్ గా నటించి మెప్పించాడు. ఇలా తన అదృష్టాన్ని అన్ని విధాల పరీక్షించుకుంటూనే వస్తున్నాడు. మొన్నటి వరకు రొటీన్ చిత్రాల వైపే మొగ్గుచూపిన సాయికి.. ఇటీవల కొంత భిన్నమైన చిత్రాల్లో నటించే అవకాశాలొస్తున్నాయి. మొన్న విడుదలైన ‘అరకు రోడ్డులో’ మూవీ క్రైమ్ థ్రిల్లర్. తాజాగా విడుదలైన ‘నేనోరకం’ మాత్రం కిడ్నాప్ డ్రామాగా తెరకెక్కింది. కొత్త దర్శకుడు సుదర్శన్ సలేంద్ర ఈ మూవీని సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కించాడు. ఎక్కడా దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం లేకపోయినా.. ఎంతో అనుభవం వున్న దర్శకుడిగా ఈ చిత్రాన్ని హ్యాండిల్ చేశాడు సుదర్శన్. ముఖ్యంగా సెకెండాఫ్ లో వచ్చే శరత్ కుమార్ ఎపిసోడ్ ఆద్యంతం ఉత్కంఠతను రేపుతోంది. అలానే శరత్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా చాలా బాగా డీలీ చేశాడు. దాంతో అప్పటి దాకా సస్పెన్స్ కిడ్నాప్ డ్రామాగా సాగిన కథ.. కథనానికి ఓ క్లారిటీ వచ్చేస్తుంది. దాంతో చాలా కాలం తరువాత ఓ ఫీల్ గుడ్ సస్పెన్స్ కిడ్నాప్ డ్రామా సినిమాను చూసినట్టు ప్రేక్షకులు ఫీలవుతారు.
సాయిరామ్ శంకర్ నటన బాగుంది. లవర్ బాయ్ గా… రికవరీ ఏజెంటుగా… ప్రియురాలికోసం దేనికైనా సిద్ధపడే ప్రేమికుడిగా మూడు పాత్రలను చక్కగా పోషించాడు. దర్శకుడు తనకు ఇచ్చిన బాధ్యతను చక్కగా నెరవేర్చాడు సాయిరామ్ శంకర్. హీరోయిన్ రేష్మీ మీనన్ కూడా తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేసింది. ఇక తమిళ నటుడు శరత్ కుమార్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అతని బేస్ వాయిస్ తో హీరోను ముప్పుతిప్పలు పెట్టిన విధానం ప్రేక్షకులకు నచ్చుతుంది. ప్రాణంగా పెంచిన అమ్మాయిని కిరాతకంగా చంపేస్తే… ఆ బాధ ఎలావుంటుందో ఓ తండ్రిగా పడే వేధనలో శరత్ కుమార్ చక్కగా నటించారు. పండగ ఫైనాన్స్ కంపెనీ హెడ్ గా థర్టీ ఇయర్స్ పృథ్వీ వున్నంత సేపూ కామెడీ బాగా వుంది. అలానే వైవా హర్ష కామెడీ కూడా బాగుంది. జబర్దస్థ్ టీంతో చేయించిన కామెడీ ఫైట్ పర్వాలేదు. దివంగత హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ కాసేపు వున్నా బాగుంది. మిగతా పాత్రల్లో కాశీవిశ్వనాథ్… ఆదిత్య మీనన్… గిరి తదితరులు పాత్రల మేరకు నటించారు. ఇక సాంకేతిక నిపుణుల గురించి చెప్పాల్సి వస్తే… దర్శకుడు రాసుకున్న కథ.. కథనం బాగుంది. అయితే మొదటి భాగంలో లవ్ సీన్స్ ను ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా రాసుకుని వుండి వుంటే బాగుండు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా పెట్టేశారు. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here