భక్తిరస చిత్రం ‘నీలిమలై’ ఈనెల 26న రిలీజ్

nilimalai-deccanfilm-comపల్లెర్ల ఆనంద్ కృష్ణ కధానాయకుడిగా, వృషాలి గోస్వామి కథానాయికగా, పల్లెర్ల ఆనంద్ నిర్మించిన చిత్రం ‘నీలిమలై’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రపాటలకు ట్రైలర్స్ కు అద్భుత స్పందన లభించింది. లవ్, యాక్షన్, డివోషనల్ మెయిన్ ధీమ్ గా తెరకెక్కించి ఈ చిత్రం ఈనెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా…

చిత్ర నిర్మాత పల్లెర్ల ఆనంద్ మాట్లాడుతూ “ఇటీవల రిలీజ్ చేసిన మా చిత్రం ఆడియో మంచి విజయం సాధించింది. పాటలు చాలా బాగా ఉన్నాయని చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మా చిత్రాన్ని చుసిన డిస్ట్రిబ్యూటర్స్ చాలా బాగుంది అని మా చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం మాకు చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రం కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని గట్టి నమ్మకంతో వున్నాం. ఈ నెల 26న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం.” అని అన్నారు.

ఈ చిత్ర దర్శకుడు సూర్యకిరణ్ ఇలాటి మాట్లాడుతూ “నిర్మాత పల్లెర్ల ఆనంద్ గారు మరియు ఈ చిత్రానికి పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరు బాగా సహకరించారు. చిత్రం అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఏ చిత్రానికైనా పాటలు విజయం సాధిస్తే సినిమా సగం విజయం సాధించినట్లే.. మా సినిమాలో పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మా చిత్రం కచ్చితంగా పెద్ద విజయాన్ని సాధిస్తుంది. ఇంత మంచి సినిమా చేస్తానని ఊహించలేదు. 26న మీ ముందుకు వస్తున్నాం. మా చిత్రాన్ని ప్రేక్షకులు చూసి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాము” అన్నారు.

ఆర్టిస్ట్స్
పల్లెర్ల ఆనంద్ కృష్ణ
వృషాలి గోస్వామి
భానుచందర్
ప్రభావతి
అలీ
సాయికిరణ్
లక్ష్మి
అర్చితా
సత్యప్రకాష్
ఛత్రపతి శేఖర్
రాథోడ్ మాస్టర్
జోగారావు
ప్రతాప్

మెయిన్ టెక్నీషియన్స్
నిర్మాత : పల్లెర్ల ఆనంద్
కధ, స్క్రీన్ ప్లే, డైరక్షన్ : సూర్య కిరణ్ ఇలాడి
డైలాగ్స్ : ఆర్. రామచంద్రా రెడ్డి
లిరిక్స్ : సాగేవే దేవేంద్ర, వేల్పుల వెంకటేష్, మహేష్
మ్యూజిక్ : దేవేంద్ర, నీరు
సినిమాటోగ్రఫీ : కిరణ్ కుమార్ డీకొండా
కొరియోగ్రఫీ : చిరంజీవి
ఫైట్స్ : దేవరాజ్
ఆర్ట్ : విజయ కృష్ణ
ఎడిటింగ్ : విజయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *