రివ్యూ: ‘నాన్న-నేను-నా బాయ్ ఫ్రెండ్స్’… ఓ సారి చూసేయొచ్చులే!

194

నటీనటులు: హెబ్బాపటేల్, అశ్విన్, నోయెల్, పార్వతీశం, తేజశ్వి మదివాడ, రావు రమేష్, సన తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
ఫొటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు
నిర్మాత: బెక్కం వేణు గోపాల్
కథ: సాయి కృష్ణ
స్క్రీన్ ప్లే-మాటలు: ప్రసన్న కుమార్
దర్శకత్వం: భాస్కర్ బండి
రేటింగ్: 2.5
ఈ సినిమా పోస్టర్లు మొదలుకొని… టీజర్.. ట్రైలర్ల దాకా అన్నీ హీరోయిన్ ను ప్రధానంగా హైలైట్ చేస్తూ ప్రమోషన్ సాగించినవే. గతంలో హెబ్బా పటేల్ ‘కుమారి 21ఎఫ్’ అనే మూవీలో ఎలాగైతే యూత్ ను ఆకట్టుకోవడానికి ట్రై చేసిందో… మరోసారి అలానే యూత్ ను అలరించేందుకు ‘నాన్న-నేను-నా బాయ్ ఫ్రెండ్స్’తో ముందుకొచ్చింది. వి.వి.వినాయక్ కాంపౌండ్ నుంచి వచ్చిన భాస్కర్ బండి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం అయ్యాడు. మరి చిత్రం యూత్ కి ఏమాత్రం కనెక్ట్ అయిందో చూద్దామా?
కథ: టీనేజ్ అమ్మాయిలు చదువుతూనే ప్రేమలో పడిపోతారు. ఉద్యోగం చేసే అమ్మాయిలు ప్రేమలో పడకుండా వుంటారా? ఇలాంటి అమ్మాయే పద్మావతి(హెబ్బాపటేల్). సిటీ కొచ్చి ఉద్యోగం చేసుకొని.. ప్రేమించి పెళ్లాడాలనే ఉద్దశం ఆమెది. ఆ క్రమంలో ఆమె ముగ్గురు అబ్బాయిలను గోకుల్(నోయెల్), నాని(అశ్విన్), నమో(పార్వతీశం)లను ప్రేమ పేరుతో లైన్లో పెట్టేస్తుంది. వారు ఆమెను ఎంతో ప్రేమించేస్తుంటారు. ఇలాంటి అమర ప్రేమికులలో ఎవరిని వివాహం చేసుకోవాలో తెలియక సతమతమవుతుంది పద్మావతి. అలాంటి పరిస్థితుల్లో వున్న అమ్మాయికి తన తండ్రి (రావు రమేష్) ఎలా సపోర్టివ్ గా నిలిచాడు? ఆ ముగ్గురు ప్రేమికులు పద్మావతి ప్రేమను ఎలా అర్థం చేసుకున్నారు? చివరికి ఎవరు వివాహం చేసుకున్నారనేదే మిగతా కథ.
కథ-కథనం విశ్లేషణ: టైటిల్ చూడగానే ఇదేదో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో పాటు.. కాస్త అడల్ట్ కామెడీ కూడా వుంటుందని అనుకుంటారంతా. కానీ కథను రచయిత బి.సాయికృష్ణ కాస్త భిన్నంగానే రాసుకున్నాడు. ప్రసన్నకుమార్ రాసిన స్క్రీన్ ప్లే-సంభాషణలు కూడా పర్వాలేదనిపిస్తాయి. ముగ్గురు అబ్బాయిలను ప్రేమించే ఓ అమ్మాయి అంటే.. నమ్మశక్యంగా వుండదు ఎవరికైనా. కానీ దాన్ని కూడా ప్రేక్షకులకు చాలా ఆమోదయోగ్యంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఇలాంటి కథలు మొదటి హాఫ్ వరకు రొటీన్ గా సాగి.. ఇంటర్వెల్ లో ఓ ట్విస్ట్ ఇచ్చా… ఆ తరువాత ప్రీ క్లైమాక్స్- క్లైమాక్స్ లో మాత్రం పీక్ దశకు వెళ్లిపోతాయి. ఈ రెండు సీన్లలోనూ ఇక ఎమోషనతోనే లాగించెయ్యాలి. దర్శకుడి ప్రతిభ కూడా అక్కడే బయటన పడుతుంది. అక్కడే ఈ చిత్రదర్శకుడు సక్సెస్ అయ్యాడు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్స్ ని బాగా డీల్ చేశాడు.
అయితే మొదటి భాగం ఆరంభం.. ఎండింగ్ లో తీసుకున్నంత శ్రద్ధ.. మిగతా స్టోరీని మధ్యలో నడిపించడంలో కాస్తంత ఇబ్బందే పడ్డాడు. దాంతో సినిమా చాలా స్లోగా సాగుతుంది. మాస్ ఆడియన్స్ కైతే మరీ బోరింగ్ అనిపించడం ఖాయం. జబర్దస్త్ టీమ్ తో అక్కడక్కడ కామెడీ చేయించారు. అది కొంత వరకు వర్కవుట్ అయిందనే చెప్పొచ్చు. అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపూ పాత సినిమా రెఫరెన్స్ లు మన ముందు కదులుతూనే వుంటాయి. ఈ సినిమాను ఇంకాస్తా సీరియస్ గా తీసుకుని తెరకెక్కించి వుంటే కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేదే.
రావు రమేష్ పాత్ర నిడివి తక్కువే అయినా… ఆరంభాన్ని.. ముగింపుని అదరగొట్టేశాడు. తనకు నచ్చిన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ మనసును దోచేశాడు. ఇక ప్రధాన లీడ్ పోషించిన హెబ్బాపటేల్ చిలిపి పాత్రలో బాగానే నటించింది కానీ… ఎమోషనల్ సీన్లలో తేలిపోయింది. బరువైన పాత్రల్లో ఆమె ఇప్పట్లో మెప్పించడం కష్టమే అనిపిస్తుంది. ముగ్గురు హీరోల్లో పార్వతీశం కామెడీ పర్వాలేదు. తేజశ్వి మదివాడ కూడా ఎప్పటిలాగే నటించి మెప్పించింది.
దర్శకుడు కథ..కథనాన్ని బాగానే డీల్ చేశాడు కానీ… కథనే బలంగా లేకపోవడంతో అతడు మాత్రం ఏమీ చేయలేకపోయాడు. అయితే తనకున్న సహాయ దర్శకుడి అనుభవంతో.. ఈ సినిమాను కొంత కమర్షియల్ పంథాలోనే నడిపించాడు. రొటీన్ స్టోరీనే అయినా… ప్రసన్నకుమార్ రాసిన సంభాషణలు బాగున్నాయి. క్లైమాక్స్ లో కొన్ని బరువైన సంభాషణలు బాగా పేలాయి.శేఖర్ చంద్ర అందించిన సంగీతం పర్వాలేదు. ఛోటా కె.నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా మాస్ ను మెప్పించే ఎలిమెంట్లు అంతంత మాత్రమే వున్నా… అన్ని తరగతుల వారూ ఓసారి చూసేయొచ్చనే భావన థియేటర్ నుంచి బయటకు వచ్చే సగటు ఆడియన్ అభిప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here