ఏప్రిల్ 16న విడుద‌ల‌వుతున్న ‘ట‌క్ జ‌గ‌దీష్’

86

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన `టక్ జగదీష్` 2021లో ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘నిన్నుకోరి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది.

క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన `ట‌క్ జ‌గ‌దీష్ ఫ‌స్ట్‌లుక్‌`కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. లేటెస్ట్‌గా ఈ మూవీ విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తూ నానిని ఇంత‌కు ముందెన్న‌డు చూడ‌నంత క్లాస్‌లుక్‌తో స‌రికొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేశారు మేక‌ర్స్. కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్ళికొడుకు గా రెడి అవుతున్న నాని లుక్ ఆకట్టుకుంటుంది.

టక్ జగదీష్ ఏప్రిల్ 16 న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగు సంవ‌త్స‌రాది అయిన ఉగాది పండగ ఏప్రిల్ 13..పండ‌గ మూడు రోజుల తరువాత టక్ జగదీష్ థియేటర్లకు రావడంతో మ‌ళ్లీ సెల‌బ్రేష‌న్స్ మొద‌లుకానున్నాయి.

రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం:
నేచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్ త‌దిత‌రులు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here