డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోన్న ‘ట‌క్ జ‌గ‌దీష్’

106

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న మూవీ  ‘ట‌క్ జ‌గ‌దీష్`. నాని కెరీర్‌లో 26వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన `ట‌క్ జ‌గ‌దీష్ ఫ‌స్ట్‌లుక్‌`కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ మూవీ డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు ఈ రోజు (జ‌న‌వ‌రి4) నుండి ప్రారంభ‌మయ్యాయి. ఈ సినిమాను స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా ఏప్రిల్ 2021లో విడుద‌ల చేయ‌నున్నారు.

‘నిన్నుకోరి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ కావ‌డంతో  ‘ట‌క్ జ‌గ‌దీష్‌’పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here