ఆగష్టు 7 న నాగార్జున, నాని ల దేవదాస్ ఫస్ట్ లుక్..!!

39
నాగార్జున, నాని కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం దేవదాస్.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఆగష్టు 7 సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రీల్యూడ్ పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్ర నిర్మాతలు.. ఈ పోస్టర్ లో ఆల్కహాల్ బాటిల్ ఉండగా పక్కనే ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అని విషెస్ తెలియజేశారు. ఈ సరికొత్త ఎంటర్టైనర్ కి యంగ్ డైరెక్టర్ శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా, ఆకాంక్ష సింగ్, రష్మిక మందాన  హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.. చివరి దశలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ని వైజయంతి బ్యానర్ పతాకంపై అశ్వినిదత్ నిర్మిస్తుండగా, సి ధర్మరాజు ఈ సినిమాని సమర్పిస్తున్నారు.. సెప్టెంబర్ 27 న సినిమాని రిలీజ్ చేయబోతున్నారు..
తారాగణం:
నాగార్జున అక్కినేని నాని, రష్మిక మండన, ఆకాంక్ష సింగ్, నరేష్ వికె, బాహుబలి ప్రభాకర్, రావు రమేష్, వెన్నెల కిషోర్, ఆవసరాల శ్రీనివాస్, సత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here