రివ్యూ: నాగశౌర్య ‘ఛలో’

379

తారాగణం: నాగశౌర్య – రష్మిక మందానా – వెన్నెల కిషోర్ – సత్య – నరేష్ – ప్రగతి – అచ్యుత్ కుమార్ – మైమ్ గోపి తదితరులు
సంగీతం: మహతి సాగర్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
నిర్మాత: ఉష ముల్పూరి
కథ-స్క్రీన్ ప్లే-మాటలు- దర్శకత్వం: వెంకీ కుడుముల

 

లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య. తాజాగా అతని సొంత బ్యానర్లోనే ‘ఛలో’ సినిమాను తెరకెక్కించాడు. త్రివిక్రమ్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన వెంకీ కుడుముల ఈ చిత్రానికి కథ.. మాటలు.. దర్శకత్వం అందించారు. ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించిందో చూద్దాం పదండి.

కథ: హరి (నాగశౌర్య) ఎప్పుడూ ఏదో ఒక గొడవలోకి తలదూర్చి.. తన తల్లిదండ్రులకు తలనొప్పి తెచ్చి పెడుతుంటాడు. దాంతో అతన్ని ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లోఎప్పుడూ గొడవల్లో మునిగి తేలే తిరుప్పూరు అనే ఊరికి పంపిస్తాడు హరి తండ్రి. ఆ ఊరి దగ్గర్లోనే ఉండే కాలేజీలో చేరిన హరి.. అక్కడేవ వుండే కార్తీక (రష్మిక)ను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. అయితే.. అంతకు ముందే తన వల్ల అవమానానికి గురైన అవతలి ఊరి పెద్ద కూతురే కార్తీక అని హరికి ఆలస్యంగా తెలుస్తుంది. మరి అలా అవమానానికి గురిచేసిన కార్తిక తండ్రి.. హరికి తన కూతురినిచ్చి పెళ్లి చేశాడా? చివరికి వీరి ప్రేమ ఎలాంటి టర్న్ తీసుకుంది తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: రెండు ఊర్ల మధ్య గొడవలు, మధ్యలో ఓ జంట ప్రేమకథ. ఇలాంటి స్టోరీలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే వుంటాయి. అలాంటి స్టోరీనే ‘ఛలో’ మూవీ కథ. అయితే దీనికి మంచి కామెడీని జోడించి తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు కొత్త డైరెక్టర్ వెంకీ కుడుముల. తనకు ఇష్టమైన కామెడీనే నమ్ముకొని కమెడియన్స్ సత్య, వెన్నెల కిశోర్ లాంటి స్టార్ కమెడియన్స తో కడుపుబ్బ నవ్వించాడు. కాస్త సినిమాటిక్ లిబర్టితో సినిమాను ఆద్యంతం నవ్వులు విరిసేలా ముందుకు నడిపించాడు దర్శకుడు. దీనికి తోడు నాగశౌర్య, రశ్మిక జోడితో ఓ ఫ్రెష్ నెస్ సినిమాలో కనిపిస్తుంది. దాంతో సినిమా ఎక్కడా బోరింగ్ అనిపించదు.
నాగశౌర్య ఇందులో చాలా నాచురల్ గా నటించాడు. ఎక్కడా హీరోయిజం అనే మాట చూపించకుండా తన సహజమైన నటనతో యూత్ ను మెప్పించాడు. అతనికి జోడీగా నటించిన రష్మిక కూడా చాలా బాగా నటించింది. కమెడియన్స్ సత్య, వెన్నెల కిశోర్ ఈ చిత్రంలో మరో ప్రధాన పిల్లర్స్. తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. వెంకీ కుడుముల రాసిన ఫన్నీ సంభాషణలు మరింత ప్లస్ అయ్యాయి. వాటిని ప్రేక్షకుల ముఖంలో నవ్వులు పూయించేలా వీరిద్దరూ క్యారీ చేశారు. ఇక మిగతా పాత్రలన్నీవారికి తగ్గట్టుగానే వున్నాయి.
త్రివిక్రమ్ వద్ద సహాయకునిగా పనిచేసిన దర్శకుడు వెంకీ కుడుముల మంచి కామెడీ టైమింగ్ వున్న రచయిత అనిపిస్తుంది ఈ చిత్రాన్ని చూస్తే. ముఖ్యంగా సంభాషణల విషయంలో పెన్ పవర్ చూపించాడు. దర్శకత్వంలోనూ మంచి టాలెంట్ ను చూపించారు. ఓవరాల్ గా ఓ ఫీల్ గుడ్ మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టిన వెంకీ… భవిష్యత్తులోనూ ఇలాంటి కామెడీతోనే అలరించడానికి ప్రయత్నిస్తే… విజయ పరంపరను ఆపడం కష్టమే. ఇక సంగీతం విషయానికొస్తే… ఇందులో పాటలన్నీ బాగున్నాయి. తన తండ్రిలాగానే మహతి సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా అందించాడు. ఇక సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. నాగశౌర్య, రష్మిక జోడీని చాలా అందంగా చూపించాడు. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు చాలా గ్రాండ్ గా వున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా ఇది. సో.. గో అండ్ వాచ్.
రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here