జనవరి 26 న రిలీజ్ కానున్న’ఆచారి అమెరికా యాత్ర’ !

‘దేనికైనా రెడీ’, ‘ఈడో రకం ఆడో రకం’ వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలను అందించిన హీరో విష్ణు మంచు మరియు దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డిల కలయికలో వస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న విడుదల కానుంది. దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా విడుదల తేదీని నేడు ప్రకటించారు నిర్మాతలు. విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని కీర్తి చౌదరి మరియు కిట్టు ‘పద్మజ పిక్చర్స్’ బ్యానర్ పై నిర్మించగా యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *